సుధాకర్ కేసులో సుప్రీంకు

0
5 వీక్షకులు

అమరావతి, మే 26 (న్యూస్‌టైమ్): డాక్టర్ సుధాకర్ కేసులో హై కోర్ట్ ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణలతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేసామన్నది ప్రభుత్వ వాదన. సుధాకర్‌పై విశాఖ నగరంలో జరిగిన దాడి, ఆయన్ని పోలీసులు మెంటల్ ఆసుపత్రికి తరలించడం వివాదంలో కూడా సుధాకర్ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేసినా ఆ వాదనలను హై కోర్టు పట్టించుకోలేదన్న భావనలో ప్రభుత్వం ఉంది. కేవలం మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here