యారాడ బీచ్‌లో చేపట్టిన జలదీక్ష

విశాఖపట్నం, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమానికి కొనసాగింపుగా ఉద్యోగ, ప్రజా సంఘాలు చేపట్టిన ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటానికి వివిధ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం పెదగంట్యాడ మండల పరిధిలోని యారాడ సముద్ర తీరంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మార్డుపూడి పరదేశి అధ్వర్యాన ‘జల దీక్ష’ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమన్నారు.

రాజకీయాలకు అతీతంగా కార్మికుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి జగన్ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చకు పెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. ఉమ్మడి తెలుగు ప్రజలు ఆత్మగౌరవంతో ఎన్నో పోరాటాలు, నిరాహారా దీక్షలు చేసి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 64 గ్రామల ప్రజలు తమ సర్వశ్వాన్ని త్యాగం చేశారని గుర్తుచేశారు. కర్మాగారం వల్ల ఇళ్ళు, భూమిల సహ 26 వేల ఎకారాలు త్యాగం చేస్తే ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల పేరుతో 100% శాతం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమన్నారు.

ఇది తెలుగు ప్రజలపై 100% శాతం కక్షే అని నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షడు మార్డుపూడి పరదేశి, జీవీఎంసీ 74 వార్డు కార్పొరేటర్, విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీ రెడ్డి, కార్పొరేటర్ రాజానా రామారావు, డీఈవీ అప్పారావు, మధు, ధర్మల శ్రీను, రెడ్డి జగన్నాధం, గంట్యాడ గురుమూర్తి, గంగూలూరి రోజారాణి, ఈగలపాటి యువశ్రీ, పిట్టారెడ్డి, కల్పన, ఇసుక పట్ల మేరా ముంతాజ్ బేగం, ములకలపల్లి వెంకటేష్, పామురామశాస్త్రి, గొందేశి రమణారెడ్డి, గొర్సు సత్యం, సంపంగి ఈశ్వరరావు, గోందేశి శ్రీనివాస్ రెడ్డి (బుజ్జి), చక్రి, గొందేశి నాగిరెడ్డి, పూతి తాతారావు, బాపనయ్య, ఒమ్మి ఈశ్వరీ తదితరలు పాల్గొన్నారు.