టీఎస్‌పీజీఈ సెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేస్తున్న దృశ్యం

హైదరాబాద్, అక్టోబర్ 16 (న్యూస్‌టైమ్): విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల సహాకారంతో ఉన్నత విద్యామండలి టీఎస్‌పీజీఈసీఈటీ (TSPGECET)-2020ని విజయవంతంగా నిర్వహించిందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన పీజీఈసీఈటీ పరీక్షల ఫలితాలను సంబంధిత అధికారులతో కలిసి ఈ రోజు విడుదల చేశారు.

మీడియా సహాకారం, వారి భరోసా ఈ పరీక్ష నిర్వహించడానికి చాలా ఉపయోగపడిందని పేర్కొన్నారు. కౌన్సిలింగ్ ఆఖరి సంవత్సరం పరీక్షల ఫలితాలు వెలువడిన తరువాత నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య లింబాద్రి, రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్ రెడ్డి, ఉన్నత విద్యామండలి కన్వీనర్ ఆచార్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.