కోదాడ పట్నంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

454

సూర్యాపేట: జిల్లా ఎస్.పి ఆర్.వెంకటేశ్వర్లు అధ్వర్యాన కోదాడ పట్నంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, లాడ్జీలు, హోటళ్లు, మెయిన్ రోడ్, సినిమా హాళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను తనిఖీ చేసిన పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించడమే పోలీసుల ధ్యేయమని, అందుకోసమే ఈ తనిఖీలు నిర్వహించామన్నిరు. ఈ తనిఖీల్లో కోదాడ పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు నాగభూషణరావు, క్రాంతికుమార్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.