ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా సుధాకర్‌

0
3 వీక్షకులు
గవర్నర్‌ నుంచి అవార్డును స్వీకరిస్తున్న ఆచార్య జి.సుధాకర్‌

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా ఏయూ హ్యూమన్‌ జెనిటిక్స్‌ విభాగ ఆచార్యులు జి.సుధాకర్‌ ఎంపికయ్యారు. శ్రీకాకుళం అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ సైన్స్‌ కాంగ్రెస్‌లో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ చేతుల మీదుగా దీనిని అందుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, మంత్రి ధర్మాన క్రిష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్ర పరిశోధనలు, సాంకేతిక రంగంలో ఆచార్య సుధాకర్‌ చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఆయనకు దీనిని ప్రధానం చేశారు.