స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (న్యూస్‌టైమ్): వారం రోజుల పాటు కొనసాగనున్న ప్రవర్తన పరివర్తన ప్రచారంలో ‘గందగి ముక్త్ భారత్’లో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ రోజు ఇక్కడ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) అకాడమీని ప్రారంభించారు. ఐవీఆర్ టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి, ఎస్‌బీఎం అకాడమీ స్వాగత సందేశాన్ని వినడం ద్వారా గజేంద్ర సింగ్ షేఖావత్ దీనిని ఆవిష్కరించారు. ప్రవర్తన పరివర్తనను నిలకడగా కొనసాగించడానికి, స్వచ్ఛగ్రాహిలు, ఇతర క్షేత్రస్థాయి కార్యకర్తల వంటి ముఖ్య వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఎస్‌బీఎం (జి) 2వ దశలో ప్రముఖంగా ప్రస్తావించిన లక్ష్యాలను సాధించడంలో ఓడిఎఫ్ ప్లస్‌పై ఈ ఐవీఆర్ ఆధారిత ఉచిత మొబైల్ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సు కీలకమైంది. ప్రపంచం ఇప్పటివరకు చూడని విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) గ్రామీణ భారతదేశాన్ని పారిశుద్ధ్యం కోసం ఒక ప్రజా ఉద్యమంగా పరివర్తన కలిగించిందని కేంద్ర మంత్రి చెప్పారు.

‘‘ఇది 2019 అక్టోబర్ 2న అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) ప్రకటనను చారిత్రాత్మకంగా సాధించడానికి దారితీసింది, తద్వారా గ్రామీణ భారతదేశం ఓడిఎఫ్‌గా మార్చింది. అసాధారణ విజయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఎస్‌బీఎం (జి) రెండవ దశ ఈ సంవత్సరారంభంలో ప్రారంభమైంది. ఇది ఓడీఎఫ్ స్థిరత్వం, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్ఎల్డబ్ల్యూఎం)పై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం ఎవరూ లబ్దిపొందలేదనకుండా, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకునేలా చేస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ తన మొబైల్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో స్వచాగ్రహిలతో పాటు పిఆర్ఐ సభ్యులు, సామజిక సంస్థలు, ఎన్జీఓలు, స్వయం సహాయక సంఘాలు, ఎస్‌బీఎం (జి)తో సంబంధం ఉన్నవారి ద్వారా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి రత్తన్ లాల్ కటారియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఎస్‌బిఎం (జి) బృందాన్ని అభినందించారు. గత ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా భారీ ప్రవర్తన మార్పును ప్రేరేపించినందుకు అసంఖ్యాకమైన స్వచ్ఛ గ్రహీల అవిశ్రాంత కృషిని అభినందించారు. గ్రామీణ సామజిక సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చారని, ఎస్‌బిఎం రెండవ దశలో కూడా అదే స్ఫూర్తితో పనిచేయడం కొనసాగించాలని ఆయన కోరారు. తాగునీరు, పారిశుద్ధ్యం విభాగం కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ అకాడమీ పని విధానాన్ని వివరించారు. అకాడమీ కోర్సులో 4 అధ్యాయాలు, నాలుగు ఆడియో పాఠాలు, ప్రతి అధ్యాయం చివర క్విజ్ ఉంటాయన్నారు. 50 శాతం మార్కులు వస్తే దీనిలో మంచి ఫలితం పొందినట్టని తెలిపారు. ఎస్‌బిఎం అకాడమీలో టోల్ ఫ్రీ నెంబర్ 18001800404 ద్వారా హిందీలో మొత్తం విషయాలను వినవచ్చు.