విరుగంబాక్కం, హైదరాబాద్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని విరుగంబాక్కం పోలింగ్ స్టేషన్‌లో తన భర్తతో కలిసి సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూ లైనులో నిలుచొని ఓటు వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన సాధనం అని, ఓటు వినియోగం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం అని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్హులైన అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత మరింత ఉత్సాహంతో ఓటింగులో పాల్గొనాలని సూచించారు.