విజయమ్మ పుస్తకంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు

అమరావతి, ఆగస్టు 5 (న్యూస్‌టైమ్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆయన సతీమణి విజయమ్మ ఆయన జయంతి సందర్భంగా రాసిన పుస్తకంలోని పలు అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అన్వయిస్తూ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం నాయకుడు పట్టాభిరాం కొమ్మరెడ్డి. విపక్ష టీడీపీలో కౌంటర్లు ఇస్తూ మీడియాలో కనిపించే పట్టాభి తాజాగా విజయమ్మ పుస్తకాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు. ఆయన అన్న మాటల్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం తనదైనశైలిలో ఎడిటింగ్ చేసి తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో బుధవారం పోస్టు చేసింది.

‘‘తనయుడు మాట తప్పుడు’’, ‘‘తల్లీ పుస్తకం తిరగరాయాలి తప్పదు’’ అంటూ హెడ్డింగ్‌లో పెట్టి మరీ ఆ వీడియోను విడుదల చేశారు. విజయమ్మ రాసిన పుస్తకంలోని పేజీ నంబర్ 53లో జగన్‌ రాజకీయాల్లో ఉండాలన్న ఆసక్తిని గమనించే వైఎస్ తనయుడిని ప్రోత్సహిస్తూ వచ్చారని రాసిన అంశాన్ని ప్రత్యేకించి పట్టాభి ప్రస్తావించారు. ఇలాంటి అనేక విషయాలను ఆయన విశ్లేషించారు.. అవేంటో మీరూ చూడండి.