గతసారి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగినప్పటి దృశ్యం (File photo)

హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్‌టైమ్): ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు‌ అధ్యక్షతన జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించి సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమావేశ అజెండా రూపకల్పనతో పాటు ప్రగతి భవన్‌ వద్ద శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here