అందాల ప్రదర్శనకు సై…

0
6 వీక్షకులు
తేజస్వి మదివాడ

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు భామలే అరుదుగా కనిపిస్తారు. మిగతా రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఇక తెలుగులో అరుదుగా మెరిసే తెలుగందాలు తక్కువగా ఉన్నా అందులో ఒకటి తేజస్వి మదివాడ. సినీ యాక్టర్‌గా కంటే బిగ్ బాస్ బ్యూటీగానే ఎక్కువ పేరును సంపాదించుకుంది. ఇండస్ట్రీకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో పరిచయం అయిన ఈ హైదరాబాదీ అమ్మడు.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటివరకు తెలుగులో ఇరవైకి పైగా సినిమాలలో మెరిసినా.. రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ బ్యూటీగానే అందరికి గుర్తు. ఇప్పటికి అదే ఆమె కెరీర్లో పాపులర్ ఫిల్మ్, అందాలతో పాటు అమ్మడికి కాంట్రావర్సీలు కూడా ఎక్కువే. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ అవకాశం రాగానే టీవీ ప్రేక్షకుల అందరికి తేజస్వీ సుపరిచితురాలు అయిపోయింది. బిగ్ బాస్ షోలో కూడా తనదైన శైలిలో ఓ వైపు గొడవలతో, మరోవైపు వయ్యారాలు ఒలకబోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ షో తరువాత అమ్మడికి సినిమా ఆఫర్లు అయితే ఏం రాలేదు. అయితే నటిగా తన ప్రయత్నాలను సోషల్ మీడియా వేదికగా వేగవంతం చేసింది. తనలో దాగిఉన్న సొగసులకు పదును పెడుతూ.. ఇన్నాగ్రామ్లో అందాల అరబోత చేస్తుంది. బ్రౌన్ కలర్ సూట్లో కూర్చున్న పోజు ఒకటి తాజాగా పోస్ట్ చేసింది. అంతే ఆ సూట్‌లో కాస్త అమ్మడు లోదుస్తులు వేసుకోకుండా ఎద అందాలను ప్రదర్శనకు నిలిపింది. ఆ భంగిమలో తేజస్విని చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. తేజస్వి ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్’ సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ సోయగాల ఆరబోతకు సినీ ప్రియులు మతులు పోగొట్టుకున్నారు. కానీ ఈ ఫోటోలో కూడా తేజస్విని పరిశీలిస్తే అదే కిక్కు వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here