రైజ్ కాలేజీని పరిశీలించిన కలెక్టర్

0
16 వీక్షకులు

ఒంగోలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): కంటైన్మెంట్ సెంటరైన రైజ్ కాలేజీ పట్టణ ప్రాంతమైన ఒంగోలుకు సంబంధించి కరోనా వైరస్ అనుమానితులను వుంచాలనే భావంతో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉన్న రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని క్వారంటైన్ సెంటరుగా మార్చి దీనికి సంబంధించిన ఫర్నిచర్, డాక్టర్స్, నర్సులు, పోలీసు సిబ్బంది తదితర ఏర్పాట్లపై రూములువారిగా క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రజలు కరోనా వైరస్ అయినటువంటి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు అయిన వారిని రైజ్ కాలేజీ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లే విధంగా 200 మందికి ఏర్పాట్లు చేసినట్లుగా సంబంధిత అధికారులను కలెక్టరు పోలా భాస్కర్ ఆదేశించారు. ఈ క్వారంటైన్ సెంటర్ టంగుటూరు పరిధిలోనిది కనుక ఆ సచివాలయ సిబ్బంది మహిళా పోలీసు, విద్యాశాఖ అసిస్టెంటు, మిగతా సిబ్బంది సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ప్రతిరోజు రూములన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భూ సేకరణ డిప్యూటి కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్.డి.ఓ. ప్రభాకర రెడ్డి, మెప్మా పి.డి. కృపారావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. లక్ష్మా నాయక్, ఎ.స్.సి. కార్పోరేషన్ ఇ.డి. మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here