టీమిండియా జట్టు ఆటతీరును మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో పోస్టుచేసిన జగన్ చిత్రం

బ్రిస్బేన్‌, అమరావతి, జనవరి 19 (న్యూస్‌టైమ్): ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో స్టన్నింగ్‌ విజయం సాధించడంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘హార్టీ కంగ్రాట్స్‌ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్‌లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది.’ అని తెలిపారు.