రవీంధ్ర భారతి ప్రారంభించిన రోజు…

0
6 వీక్షకులు

రవీంద్ర భారతి… ఒక సాంసృతిక కళా భవనం. హైదరాబాద్‌లో సైఫాబాద్ ప్రాంతంలో లకడీ కా పుల్ (కలప వంతెన) బస్టాండ్ సమీపంలో కల ఈ పెద్ద భవనంలో నిత్యమూ ఏదో ఒక సాంసృతిక కార్యక్రమం జరుగుతూ రద్దీగా ఉంటుంది.

దీనిని ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. రవీంద్రభారతి నిర్మాణం 1964లో జరిగినది. మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఏసీ (సెంట్రల్ ఏయిర్ కండిషన్ సిస్టం) చేయబడిన ఆడిటోరియం. స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి.

క్షణాలలో స్టేజీ అలంకరణ మార్పు చేస్తుంటారు. అందమైన ఉద్యానవనాలు, పౌంటెన్స్, చుట్టూ అదనపు ఆకర్షణలు. ఒకే సారిగా వెయ్యిమంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం. దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.

ముందు వైపు హాలులో రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహం ఉంది. దీని తలుపులు, పక్క గోడలు అన్నిటికీ నాణ్యమైన కలపను వాడారు. రవీంద్రభారతికి అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here