ఎన్నికల వ్యయ నిర్వహణలో ఆర్వీలదే కీలకపాత్ర

115

మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): ఎన్నికల వ్యయ నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని కృష్ణా జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలు, ఎన్నికల వ్యయ నియంత్రణకై ఏర్పాటు చేసిన వివిధ టీములు వీడియో సర్వేలైన్స్ టీం, వీడియో వ్యుయింగ్ టీం, అకౌంట్స్ టీం, ప్లైయింగ్ స్క్వాడ్ టీం, సాటిక్ సర్వే టీములు అప్రమత్తంగా పని చేయాలని అభ్యర్దుల వ్యయం నమోదు చేయాలని అన్నారు.

జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఫారం-6, 7,8, 8ఎ, డిస్‌పోజ్ కలెక్టర్ సమీక్షించారు. ఫారం-7, 8, 8ఎలు ఈ నెల 20లోగా డిస్‌పోజ్ చేయాలని, ఫారం-6ను ఈ నెల 25లోగా డిప్‌పోజ్ చేయాలన్నారు. వీడియో కాన్పరెన్సులో పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు వారి వారి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. వీడియో కాన్పరెన్సులో ఎన్నికల పరిశీలకులు జయగణేష్, అన్సారీ, అరుణ్ కచ్చప్ , డీఆర్వో ఎ. ప్రసాద్, ముడ వీసీ పి. విల్సన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.