ప్రాణాలతో ఆడుకుంటున్న పర్యావరణం

2370
ఢిల్లీలోని జన్‌పథ్ నుంచి ఇండియా గేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో వాహన కాలుష్య దృశ్యం

భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులకు మధ్య పెరుగుతున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మంచి పురోగతిని చూస్తున్నాం. తొలిసారిగా ఆర్థిక సర్వేలో వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. ఆర్థికాభివృద్ధి ఫలితంగా భూమి, నీరు, గాలి, అడవులు మొదలైన సహజ వనరులతోపాటు వృక్ష, జంతు సంబంధ ఆవాసాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు భూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ పరిస్థితుల్లో ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టి గతం కంటే మరింత ఎక్కువగా సంభవిస్తున్నాయి. అందుకే ఇటీవల జరిగిన రియో సదస్సు కూడా ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. పన్నెండో పంచవర్ష ప్రణాళికలోనూ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని; తక్కువ కర్బన సాంద్రత ఉన్న వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

రాజధాని హస్తినలోని ఇండియా గేట్ ముంగిట వాయు కాలుష్య దృశ్యం

ప్రపంచంలో రోజు రోజుకు సాంకేతికత పెరుగుతున్నాకొద్ది కాలుష్యం కూడా పెరుగుతుంది. దీని ద్వారా మనుషులు, పశువులు, పిచ్చుకలు, జీవరాసులన్నింటి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. సగటున జీవించాల్సినంత కాలం కూడా ఇప్పటి కాలంలో బతకడం కష్టంమవుతుంది. ఈ కాలుష్యం ద్వారా ఓజోన్ పొర కూడా పలుచబడి సూర్యరశ్మి నేరుగా భూమిపైన పడడంతో నేలతల్లి కూడా నెర్రెలుబారుతుంది. ఈ కాలుష్యం ద్వారా వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న దేశాలతో పోల్చకుంటే భారత దేశం కాలుష్యంలో రెండో స్థానంలో ఉందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐసీ) కొత్త అధ్యయనంలో తెలిపింది.

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ ముందు కాలుష్య పరిస్థితి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన సూచికలకు భారతదేశం చాలా దూరంగా ఉంది. అంటే 48 కోట్లకు పైగా భారతీయులు అంటే దాదాపు 40% మంది ప్రజలు వారి ఏడు సంవత్సరాల ఆయుర్దాయ కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. 2013-17లో చేసిన రిజిస్ట్రేషన్ సర్వేలో భారతదేశంలో ఆయుర్దాయం 2011లో 67 సంవత్సరాల నుండి 69 సంవత్సరాలకు మెరుగుపడిందని తేలింది.

కానీ పంజాబ్, చండీగ, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రమాదకరమైన వాతావరణ కాలుష్యం వలన వారి సగటు ఆయుర్దాయం ఏడు సంవత్సరాలు తగ్గుతుంది. ఈ ప్రాంతంలో 1998 నుండి 2016 వరకు 72 శాతం కాలుష్యం పెరగడం ద్వారా ఇలాంటి ఫలితాలు బయటికి వస్తున్నాయి. అంతేకాక కాలుష్యం కారణంగా 7 నుంచి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుర్దాయం కోల్పోయే ప్రమాదం ఉన్న 14 నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటిగా ఉందని ఎపిక్ అధ్యయనంలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలకు భారతదేశం కట్టుబడి ఉంటే, పరిస్థితి మెరుగుపడవచ్చని వారి అధ్యయనం కనుగొన్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయి మహానగరంలో విషం చిమ్ముతున్న పొగ కాలుష్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రేణువుల కాలుష్యాన్ని తగ్గించడం వల్ల భారతదేశం అంతటా సగటున ఆయుర్దాయం 4.3 ఏళ్ల కయసును పెంచుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ ఈ ఏడాది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ)ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం విజయవంతమైతే సగటు భారతీయుడి ఆయుర్దాయం సుమారు 1.3 సంవత్సరాలు, ఇండో-గాంగెటిక్ మైదానంలో ఉన్నవారికి 2 సంవత్సరాల ఆయుర్ధాయం పెరగవచ్చని తెలిపారు.