సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకుని క్షేత్రస్థాయి పర్యటన

2241

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యయ (ఎక్స్‌పెండేచర్) పరిశీలకుడు అమిత్ సేన్ గౌతమ్ పాత్ర సోమవారంనాడు కాకినాడ కలక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను స్వయంగా పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్, సీ-విజిల్, సువిధ, ఐటీసీ యాప్ ఇనఫర్మేషన్ సెల్, ఎమ్‌సీసీ కంప్లైల్ సెల్, ఎక్స్‌పెండేచర్‌ సెల్, మీడియా మోనిటరింగ్ సెల్స్ పని తీరును వివరించారు.

ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు సంబంధించి ప్రచారానికి అనుమతులు జారీ, తదతర విషయాలను కలెక్టరు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.