న్యూఢిల్లీ, నవంబర్ 27 (న్యూస్‌టైమ్): ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో (కేఎంఎస్ 2020-21) ప్రభుత్వం ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పథకాల్ని(ఎంఎస్‌పీ) అమ‌లు చేస్తోంది. దీని ప్రకార‌మే ఖరీఫ్ దిగుబడుల‌ను రైతుల నుండి ఎంఎస్‌పీ వద్ద కొనుగోలు చేస్తోంది. 2020-21 ఖరీఫ్ వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛండీగ‌ఢ్‌, జమ్మూ, కశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మ‌హారాష్ట్రల‌లో రైతు వ‌రి దిగుబడుల సేక‌ర‌ణ జోరుగా సాగుతోంది. ఈ నెల 25వ తేదీ నాటికి మొత్తం 307.03 ఎల్‌ఎమ్‌టీల వరిని కొనుగోలు చేశారు.

గత ఏడాది కోనుగోళ్లు 259.41 ఎల్‌ఎమ్‌టీలుగా నిలిచాయి. గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే ఇది 18.35 శాతం అధికం. మొత్తం 307.03 ఎల్‌ఎమ్‌టీల వ‌రి కొనుగోళ్ల‌లో పంజాబ్ ఒక్కటే 202.53 ఎల్‌ఎమ్‌టీల వ‌రిని అందించింది. మొత్తం వ‌రి సేకరణలో ఇది 65.96 శాతానికి స‌మానం. సుమారుగా 27.81 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కేఎంఎస్‌ సేకరణ కార్యకలాపాల నుండి లబ్ధిపొందారు. వీటి ఎంఎస్‌పీ విలువ రూ.57967.79 కోట్లు. దీనికి తోడు ఆయా రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020కు సంబంధించి దాదాపు 45.24 ఎల్ఎంటీల‌ ప‌ప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరింర‌ణ‌కు గాను అనుమతి మంజూరైంది.

ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద ఈ సేక‌ర‌ణ‌కు అనుమ‌తులిచ్చారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి 1.23 ఎల్‌ఎమ్‌టీల కొబ్బ‌రి (శాశ్వత పంట) కొనుగోలుకూ అనుమతి ఇవ్వబడింది. పీఎస్ఎస్ ప‌థ‌కం కింద వివిధ పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బ‌రిని సేకరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు అందిన త‌రువాత త‌గిన అనుమ‌తులివ్వ‌డం జ‌రుగుతుంది. తద్వారా ఈ పంటల ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి గాను నోటిఫైడ్ ఎంఎస్‌పీ వ‌ద్ద న‌మోదిత రైతుల‌ను నుంచి నేరుగా పొందవచ్చు. నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో సంబంధిత రాష్ట్రాలు/యుటీలలో మార్కెట్ రేటు కంటే ఎంఎస్‌పీ తక్కువగా ఉన్నా రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు ప్రొక్యూర్‌మెంట్ కార్య‌క‌లాపాలను చేప‌డుతుంది. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు (25.11.2020) ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా రూ.465.05 కోట్ల విలువైన దాదాపు 86199.73 మెట్రిక్ టన్నుల పెస‌ర్లు, మినుములు, వేరుశనగ, సోయాబీన్లను సేక‌రించింది.

వీటి ద్వారా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యాణా, రాజస్థాన్ రాష్ట్రాల‌లో 49736 మంది రైతులకు లబ్దిచేకూరింది. దీనికి తోడు ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు రూ.52.40కోట్ల ఎంఎస్‌పీ విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బ‌రిని (శాశ్వత పంట) స‌మీక‌రించారు. దీని వ‌ల్ల కర్ణాటక, తమిళనాడులలోని 3961 మంది రైతుల లాభం చేకూర్చింది. కొబ్బ‌రి, మినుములను ఉత్ప‌త్తి చేసే ప‌లు ప్ర‌ధాన‌ రాష్ట్రాల్లో ధ‌ర‌లు, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజల రాక ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / ‌కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వాలు దిగుబ‌డులు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పంజాబ్, హర్యాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ కింద ముడి ప‌త్తి (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు రూ.7527.31 కోట్ల విలువైన 2549404 ప‌త్తి బేళ్ల‌ను కొనుగోలు చేశారు. దీని వ‌ల్ల 513960 మంది రైతులకు ల‌బ్ది చేకూరింది.