కుప్పకూలిన కివీస్

0
6 వీక్షకులు

క్రైస్ట్‌చర్చ్‌ (న్యూజిలాండ్), మార్చి 1 (న్యూస్‌టైమ్): క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు లంచ్ సమయానికి కివీస్‌ జట్టు 53 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 63/0తో రెండో రోజు ఆటను తిరిగి ప్రారంభించిన కివీస్ జట్టును భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు.

రెండో రోజు కివీస్‌కు ఆదిలోనే ఉమేశ్‌యాదవ్‌ పెద్ద షాకిచ్చాడు. 25.3 ఓవర్‌లో టామ్‌ బ్లండెల్‌(30)ను ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ విలియమ్సన్‌(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాస్‌టేలర్‌(15)తో కలిసి టామ్‌ లాథమ్‌(52) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 40 పరుగుల జోడించాక జడేజా టేలర్‌‌ని అవుట్ చేసి వీరిని విడదీశాడు. ఇక కాసేపటికే లాథమ్‌(52) షమి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

అనంతరం హెన్రీ నికోల్స్‌(14)కూడా వెంటనే వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు 142 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్‌ (0), టిమ్‌సౌథీ(0) వెంటవెంటనే అవుట్ చేశాడు. దీంతో కివీస్‌ 53 ఓవర్లకు 153/7తో నిలిచింది. ప్రస్తుతం కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(19), కైల్‌ జేమీసన్‌(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి(2), జస్ప్రీత్‌ బుమ్రా(3) వికెట్లు తీయగా ఉమేశ్‌, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన అద్భుత ఫీల్డింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంలో ఎవరూ తనకు సాటిలేరని నిరూపించుకున్నాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అతడు మరో రెండు క్యాచ్‌లు అందుకొని తన వంతు కృషి చేశాడు. తొలుత రాస్‌టేలర్‌(15)ను ఔట్‌చేసిన జడ్డూ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్‌(0) క్యాచ్‌ అందుకున్నాడు. ఆపై ప్రమాదకరంగా మారుతున్న కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ను(26)ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో పాటు చివర్లో కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి నీల్‌వాగ్నర్‌(21)ను పెవిలియన్‌కు చేర్చి కివీస్‌ పరుగులను కట్టడి చేశాడు.

71.6 ఓవర్‌లో మహ్మద్‌ షమి షార్ట్‌పిచ్‌ బంతి వేయగా వాగ్నర్‌ భారీ షాట్‌ ఆడాడు. తలపై సుమారు మీటరు ఎత్తులో వెళ్తున్న బంతిని వెనక్కి పరుగెడుతూ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. రెండో రోజు ఆటలో ఈ క్యాచే హైలైట్‌గా నిలిచింది. జడ్డు అందుకున్న ఈ అద్భుత క్యాచ్‌ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జడేజాను ప్రశంసిస్తూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు ఏడు పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం టీమ్‌ఇండియా ఆటముగిసే సరికి 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఘరోంగా విఫలమైంది. ప్రస్తుతం భారత్‌కు 97 పరుగుల ఆధిక్యం ఉంది. హనుమ విహారి(5), రిషభ్‌ పంత్‌(1) క్రీజులో ఉన్నారు.

అయితే, ఈ టెస్టులో టీమ్‌ఇండియా వచ్చిన అవకాశాల్ని చేజార్చుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును 235 పరుగులకే కట్టడి చేసినా రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి తడబడ్డారు. కివీస్‌ బౌలర్లు విజృంభించడంతో టాప్‌ ఆర్డర్‌ మొత్తం ఘోరంగా విఫలమైంది. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 36 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90పరుగులే చేసింది. ప్రస్తుతం హనుమ విహారి(5), రిషభ్‌ పంత్‌(1) క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా 97 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సోమవారం వీరిద్దరు ఎలా ఆడతారనేదానిపై ఆసక్తి పెరిగింది.

అంతకుముందు 63/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ షమి(4), జస్ప్రీత్‌ బుమ్రా(3), జడేజా(2) చెలరగేడంతో ఆ జట్టు భారత్‌ కన్నా ఏడు పరుగులు తక్కువ చేసింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(52; 122 బంతుల్లో 5×4) అర్ధశతకం బాదగా చివర్లో కైల్‌ జేమిసన్‌(49; 63 బంతుల్లో 7×4)మరోసారి రాణించాడు. 177 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను జేమిసన్‌, నీల్‌ వాగ్నర్‌(21) ఆదుకున్నారు. చివరి రెండు వికెట్లను తీయడంలో భారత బౌలర్లు మరోసారి విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కోల్పోయి తొలి అవకాశాన్ని చేజార్చుకున్నారు. తొమ్మిదో వికెట్‌కు జేమిసన్‌, వాగ్నర్‌ 51 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమ్‌ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here