వారి జీవితాలు కదిలిస్తే కన్నీళ్లే?

204

మన దేశంలో పుట్టుక అనేది ఆచార సంప్రదాయాలపై, కుల మతాలపై, పంతాలు పట్టింపులపై, జాతి వివక్షతపై, కుటుంబ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం గా చెప్పుకునే మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పుట్టుక అనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యక్తి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఒక బిచ్చగాడి కుటుంబంలో పుట్టిన వ్యక్తికి, అపర కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టిన వ్యక్తికి, ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తికి, ఉన్నత శ్రేణిలో పుట్టిన వ్యక్తికి, ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి, ఒక సామాన్య కుటుంబలో పుట్టిన వ్యక్తికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అంతరాలు ఉన్న కుటుంబంలో జన్మించిన వ్యక్తులకు తమ తమ వ్యక్తిగత జీవితంలో రాణించడానికి సమాన అవకాశాలు సమాజంలో లభిస్తున్నాయా? ఒక బిచ్చగాని కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక మంచి రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతున్నాడా?

ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక బిలియనీర్ అవుతున్నాడా? నేటి యువత వారు పెట్టుకున్న లక్ష్యాలకు చేరుకుంటున్నారా? మన దేశంలో వెనకట ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా? లక్ష్యాలను పెట్టుకున్న యువత లక్ష్యాలను చేదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా ఉండటం లేదు.

పరిస్థితులు అంటే కుటుంబ పరిస్థితులు కావు. సామాజిక పరిస్థితులు. సమాజంలో అప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందిన వారికి ప్రధాన పోటీగా ఉండడం, వారి ఎదుగుదలను ప్రోత్సహించడానికి బదులు వారి అభివృద్ధిని తొక్కే ప్రయత్నం చేయడం ఇలాంటి పరిస్థితులు యువత తన లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డుపడుతున్నాయి. ఒక దుగుమ్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక బిలియనీర్ కావాలంటే మాన దేశంలో అందుకు ఉన్న అవకాశం ఎంత శాతం? ఒక బిలియనీర్ కుటుంబలో పుట్టిన వ్యక్తి ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండానే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాడు. మరి ప్రభుత్వం వీరిద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందా?

అంటే లేదనే సమాధానమే విస్పష్టం. అందుకే మన దేశంలో మనిషి పుట్టుక ప్రధాన పాత్ర వహిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే మనదేశంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విజయ తీరాలకు చేరుతున్న యువత చాలా తక్కువ మంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితికి మూల కారణం ఏంటని ప్రశ్నించుకుంటే టక్కున వచ్చే సమాధానమే పుట్టుక. మన దేశంలో యువత ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి ఇది.

ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించాలంటే సమాజంలో అందరికీ సమాంతర అవకాశాలు ఉండాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది సాధ్యమయ్యే పని కాదు. దీనికి ఒకటే మార్గం విధి రాసిన జీవితంలో మనం పోరాటక తప్పదు!