విలేక‌రుల సేవ‌లు విశిష్ట‌మైన‌వి

0
6 వీక్షకులు
  • కరోనా పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

  • స‌మాజ చైత‌న్యంలో మీడియా పాత్ర కీల‌కం

  • ఆప‌త్కాలంలో ఆప‌న్నుల‌ను ఆదుకోవాలి

  • మీడియా ప్రతిధులకు ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు సేవ‌లు

వరంగల్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): స‌మాజ చైత‌న్యం, అభివృద్ధిలో మీడియా పాత్ర కీల‌కం అని, క‌రోనా వైర‌స్ విస్తృతిని అరిక‌ట్ట‌డంలోనూ, నిర్మూలించ‌డంలోనూ విలేక‌రులు త‌మ సేవ‌ల‌ను విశిష్టంగా అందిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సాధ్య‌మైనంత సేవ చేయాల‌ని, అంద‌రికీ అండ‌గా నిలిచి, ఆదుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు అందించిన నిత్యావ‌స‌ర స‌రుకుల కిట్ల‌ను రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, వ‌రంగ‌ల్ నగ‌ర మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డిల‌తో క‌లిసి జ‌ర్న‌లిస్టుల‌కు శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లోని వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ కార్యాల‌యంలో ఏర్నాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్ర‌బెల్లి పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధులుగా, స‌మాజ చైత‌న్య సార‌థులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌ర్న‌లిస్టులు శ‌క్తివంచ‌న లేకుండా నిరంత‌రం ప‌ని చేస్తూ ప్ర‌పంచ స‌మాచారాన్ని మ‌న ముందుకు తెస్తున్నార‌న్నారు. క‌రోనా వంటి విప‌త్క‌ర ప్ర‌స్తుత సంద‌ర్భంలోనూ విలేక‌రులు త‌మ ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్నార‌న్నారు. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న లాక్‌డౌన్ సంద‌ర్భంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ని ఆదుకుంటున్న తాము, విలేక‌రుల‌ను కూడా ఆదుకోవాల‌నే ల‌క్ష్యంతో తోచిన విధంగా నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్న ఉషా ద‌యాక‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న‌ ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్‌ని ఆయ‌న అభినందించారు.

గిరిజ‌న సంక్షేమ‌, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ, ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంద‌ని, ఆప‌త్కాలంలో ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డంలో ఆ సంస్థ ది బెస్ట్ అన్నారు. ఇదే కాకుండా ఈ స‌మ‌యంలో నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డానికి కూడా ఆ సంస్థ ముందుకు వ‌చ్చింద‌న్నారు. ఉషా ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో గ‌తంలోనూ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేసింద‌ని మెచ్చుకున్నారు. క‌రోనా వైర‌స్‌ని అరిక‌ట్ట‌డంలోనూ విలేక‌రులు విశేష‌మైన సేవ‌లు అందిస్తున్నార‌న్నారు. త‌మ‌కంటే, త‌మ కుటుంబాల‌కంటే కూడా వృత్తికే ప్రాధాన్య‌మిచ్చే విలేక‌రుల‌కు నిత్యావ‌స‌ర సరుకులు పంపీణీ చేయ‌డం అత్యంత ఆవ‌శ్య‌మ‌ని మంత్రి స‌త్య‌వ‌తి అన్నారు.

ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌య‌న్న ద‌యామ‌యుడ‌ని, పిలిస్తే ప‌లికే నేత‌గా, ప్రజ‌ల నాయ‌కుడిగా మంచి పేరుంద‌న్నారు. వివిధ హోదాల్లో, ప‌ద‌వుల్లో ఉంటూ ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండే ద‌య‌న్న‌, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ద్వారా కూడా అద‌నంగా సేవ‌లందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ద‌య‌న్న తనలాంటి ఎదుగుతున్న ఎంద‌రో నేత‌ల‌కు ఆద‌ర్శ‌మ‌ని పోచంప‌ల్లి కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎనుమాముల మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ స‌దానంద్, జ‌ర్న‌లిస్టుల సంఘాల నాయ‌కులు, ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు, వివిధ సంస్థ‌ల త‌ర‌పున ప‌ని చేస్తున్న వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ళ విలేక‌రులు, డెస్క్ జ‌ర్న‌లిస్టులు, కెమెరామెన్, ఫోటో గ్రాఫ‌ర్లు తదిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here