ఆచార్యుల సేవలు నిరుపమానం

0
11 వీక్షకులు
ఆచార్య కె.ఆర్‌ రజనిని సత్కరిస్తున్న ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌
  • ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య క్రిష్ణమోహన్‌

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆచార్యులు అందిస్తున్న సేవలు నిరుపమానమైనవని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఉదయం ఏయూ తత్వశాస్త్ర విభాగంలో ఆచార్య కె.ఆర్‌ రజని పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఆచార్య కె.ఆర్‌ రజనిని సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. పదవీ విరమణత తరువాత ఆనందమయ, ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మేధస్సును, అనుభవాన్ని విశ్వవిద్యాలయం వికాసానికి వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో విభాగ విశ్రాంత ఆచార్యులు, నన్నయ వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య జార్జి విక్టర్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య జి.సత్యనారాయణ, డాక్టర్‌ పి.ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.