నిజం… దీన్ని అందరూ నమ్మాల్సిందే!

112
భీమ్‌ బేట్కా శిలా గుహలు

రైసేన్, మే 24 (న్యూస్‌టైమ్): భీమ్‌ బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం (పేలియోలిథిక్) నాటి పురావస్తు గుహలు. ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికి తెలియజేస్తున్నాయి. ఈ రకంగా దక్షిణ ఆసియా రాతి యుగం ఆరంభాన్ని కూడా చాటుతున్నాయి. ఈ గుహలు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసేన్ జిల్లా అబ్దుల్లాగన్జ్ పట్టనానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో కలవు.ఇందులో కొన్ని గుహలో 1,00,000 (1 లక్ష) సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతి నివసించారు. ఈ గుహలలోని కొన్ని రాతి గుహ చిత్రాలు 30,000 సంవత్సరాలకుపై బడినవి. ఈ గుహలు పూర్వం నాట్యం ఉనికి కూడా కనబర్చాయి.

2003లో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు సొంతం చేసుకుంది. బీమ్ బేట్కా అనే పేరు మహా భారతంలోని భీముడు వలన వచ్చింది. భీం బేట్కా అనే పదం భీమ్బౌట్కా  నుంచి వచ్చింది అంటే భీముడు కూర్చున్న ప్రదేశం. యునెస్కో భీమ్ బేట్కా రాతి గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.1888లో పురావస్తు శాఖ స్థానిక ఆదివాసీల కధనం ప్రకారం పూర్వం ఈ గుహలు బౌద్దా రామాలని నమోదు చేసింది. తరువాత ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేతైన వీ.ఎస్. వకాన్కర్ రైలులో భుపాల్ కి వెళ్తుండ తాను స్పేన్, ఫ్రాన్స్ లో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. తరువాత 1957లో వకాన్కర్ తమ బృందంతో కలసి ఈ గుహలు కనుగోన్నాడు.

మొత్తం 750 గుహలు కనుగోనగా అందులో 243 భీమ్ బేట్కా వర్గానికి, 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. గుహలోని ఏకశిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకుకు బార్కేదా వనరుగా వ్యవహరించింది. ఒకానోక ఏకాంతమైన రాతి గుహలో ఒక రాతి చిత్రం చెతిలో త్రిశూలం కలగి నృత్యం చూస్తున్న భంగిమలో ఉంది దీనికి డాక్టర్ వకాన్కర్  నటరాజు అని నామకరణం చేసారు. ఈ చిత్రాలు వాతవరణ అవపాతం కోతకు గురై కోంతమేరకు చెరిగిపోయినవి ఇందు కోసం వాటిని సంరక్షించడానికి భారత పురావస్తు శాఖ రసాయనాలు, మైనాన్ని ఉపయోగిస్తుంది. కాగా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఒక ప్రత్యేకమైన ప్రదేశం (ఉదాహరణకు అడవి, పర్వతం, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే ప్రపంచ వారసత్వ కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితాలో నామినేట్ చేయబడి ఉండాలి. ఈ కమిటీలో 21 రాష్ట్ర పార్టీలుంటాయి. వీటికి రాష్ట్రపార్టీల జనరల్ అసెంబ్లీ, 4 ఏళ్ల కొరకు ఎన్నుకుంటుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం. 2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 గలవు. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి. ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్రపార్టీలయందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.