వీపీటీ తొలి ప్రాధాన్యత…

0
20 వీక్షకులు
పోర్టు స్టాక్ యార్డు
(* పోతుమహంతి నారాయణ్)

విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ) కాలుష్య నివారణను తొలి ప్రాధాన్యతగా తీసుకుని కార్యాచరణను కొనసాగిస్తోంది. నగరానికి అనుకున్న ఉన్న పోర్టు కావడంతో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలను నిరంతర ప్రక్రియగా చేపడుతోంది. కాలుష్య నివారణ కోసం పోర్టు తీసుకుంటున్న చర్యలు బోగ్గు ఇనుము వంటి కార్గో హ్యాండ్లింగ్‌ను పూర్తిగా యాంత్రీకరణ చేయడం కోసం పిపిపి మోడ్‌లో 2 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఖర్చు చేసింది.

నిల్వ కేంద్రాల చుట్టూ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోంది. గత మూడేళ్లలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 10.50 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకూ 4 లక్షల 50 వేల మొక్కలను పెంచారు. ఈ ఏడాది 2020321కి 1.02 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. హుదుద్ సమయంలో పచ్చదనం పూర్తిగా నాశనం అయినది. తిరిగి పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్ విశాఖలో భాగంగా పోర్ట్‌కు 5.65 లక్షల మొక్కలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖతో కలిసి 2.30 కోట్ల రూపాయలతో 2 లక్షల మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని పోర్ట్ కనసాగిస్తున్నారు. ఇక బొగ్గు నిల్వలపై టార్పలిన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు.

వీటి నిర్వహణను పోర్ట్ యాజమాన్యం నిరంతరం పర్యవేక్షిస్తుంది. యాంటీ కరణ ద్వారా ధూళిని గాలిలోకి ఎగరకుండా చేసేందుకు బొగ్గు నిల్వలపై నిరంతరం నీటిని చిమ్మే విధానాన్ని కొనసాగిస్తున్నారు. 10 ఎంఎల్ నీటి శుద్ధి ప్లాంట్ ద్వారా పోర్టుకు అవసరమైన నీటి అవసరాలను తీర్చుతున్నారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో దుమ్ము ధూళీ ఎగరకుండా నిత్యం ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని రోడ్లపై చిలకరించి కాలుష్య నివారణ చర్యలను కొనసాగిస్తున్నారు. వేసవిలో ధూళి నగరంపైకి విస్తరించకుండా రోజుకు 250 టాంకర్లతో ప్రత్యేకంగా దుమ్మును నివారించేందుకు వినియోగిస్తున్నారు.

నిల్వ కేంద్రాల నుంచి దుమ్ము ధూళి నగరంపైకి ఎగర కుండా నిల్వ కేంద్రాల చుట్టూ 24 కోట్ల రూపాయలతో కాన్వెంట్ జంక్షన్ నుంచి హెచ్ 8 జంక్షన్ వరకూ 4.2 కిలోమీటర్ల వరకూ 11.5 మీటర్ల ఎత్తైన గోడను నిర్మించారు. 85 లక్షల వ్యయంతో ట్రక్ టైర్ వాషింగ్ సౌకర్యాన్ని కల్పించారు. బెర్త్‌ల వద్ద లోడింగ్ అన్ లోడింగ్ జరుగుతున్న సమయంలో ధూళి ఎగర కుండా 85 లక్షల విలువైన రెండు ఫాగ్ కెనాన్స్ వినియోగిస్తున్నారు. రోడ్డుపై నున్న దుమ్మును ఊడవడానికి యాంత్రీకరణ స్వీపింగ్ యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చారు. 2016లో సుమారుప 60 కోట్ల రూపాయలతో 10 ఎండబ్యూ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, 190 కేవీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు, దీని ద్వారా ఉత్పత్తి అయ్యే 12 మిలియన్ యూనిట్ల విద్యుత్‌లో 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పోర్టు తన సొంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తద్వారా ఆదాయాన్ని సైతం పొందుతోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పోర్టు తనకు కావలసిన 100 శాతం విద్యుత్‌ను వినియోగించుకుంటోంది.

పోర్ట్ పరిసరాల్లో కాలుష్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు కవర్డ్ స్టాక్ యార్డ్‌లా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే ఇది కార్య రూపందాల్చనుంది. 2020 ఏప్రిల్ మాసంలో విశాఖపట్నం పోర్ట్ చేసిన కార్టో, గత ఏడాది(2019) ఏప్రిల్ మాసంలో చేసిన కార్లో రవాణా ఇంచుమించు సమానంగా ఉంది. తాజా సూచీలను పరిశీలిస్తే లాక్‌డౌన్ సమయమైనా, ఏప్రిల్ 2020లో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా నమోదయ్యాయి. 2019లో ఇదే సమయంలో గాలి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తే ప్రస్తుతం నమోదైన వాటికంటే స్వల్పంగా ఎక్కువగా నమోదయ్యాయి. దీనిని బట్టి పరిశీలిస్తే, సాధారణ సమయంలో పోర్టు కార్యకలాపాలతో పాటు రోడ్డు ట్రాఫిక్ ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి అని స్పష్టమవుతోంది. విశాఖ నగరంలో గాలి కాలుష్యం కేవలం విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ ద్వారానే వెలువడుతుంది అనే వాదన సరికాదనేది ప్రస్తుత గణాంకాలను బట్టి అర్థం అవుతోంది.

సరికొత్త ఆలోచనలతో…

పోర్టు చైర్మన్ కె. రామమోహనరావు

విశాఖపట్నం పోర్టు ట్రస్టు పరిధిలో కాలుష్య నివారణకు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నట్లు పోర్టు చైర్మన్ కె. రామమోహనరావు వెల్లడించారు. కాలుష్యాన్ని నివారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడ టమే పోర్టు తొలి ప్రాధాన్యత అని చైర్మన్ స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో దుమ్ము ధూళిని నివారించేందుకు కవర్డ్ నిల్వ కేంద్రాల నిర్మాణం కోసం గ్లోబల్ టెండర్లను పిలిచినట్లు చైర్మన్ తెలిపారు. ఇందుకోసం కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కొంత ఖర్చును భరించేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. కాలుష్య నివారణకు ఇతర అందుబాటులో ఉన్న అత్యాధునిక పద్దతులను వినియోగంలోకి తీసుకువచ్చే అలచోన చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.

విశాఖపట్నం పోర్టు ట్రస్టు కాలుష్య సూచీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఇందుకోసం పోర్టు పరిసర
ప్రాంతాల్లో యాంబినెంట్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య సూచీలైన ఏఎం 10 ఏఎం 2.5 సూచీలు ఎప్పుడూ నిర్దిష్ట ప్రమాణాలలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైన అందుబాటులో ఉన్న అన్ని చర్యలను విశాఖపట్నం పోర్టు ట్రస్టు అమలు చేస్తుందని చైర్మన్ రామమోహనరావు వెల్లడించారు.

(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ‘ఎరుక’ తెలుగు దినపత్రిక ప్రాంతీయ బాధ్యుడు, +91 98491 47350)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here