తిరుమలేశుని సేవలో తరలించిన ప్రముఖుల్లో ప్రసిద్ధుడు…

348

శంకర్‌దయాళ్‌ శర్మ… ప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోదుడు, పండితుడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో 1918 ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్‌ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసారు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగా పనిచేసారు.

1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. శర్మ సెయింట్‌ జాన్‌ కళాశాల, ఆగ్రా కళాశాల, అలహాబాద్‌ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, ఫిట్జ్‌ విలియం కళాశాల, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, లింకన్స్‌ ఇన్‌, హార్వర్డ్‌ న్యాయ పాఠశాల మొదలైన అనేక విద్యా సంస్థల్లో విద్య నభ్యసించడం జరిగింది. 1940వ దశకంలో శర్మ భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అదే దశకంలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరి చివరి వరకూ అదే పార్టీకి విధేయులుగా ఉన్నారు.

1952లో అప్పటి భోపాల్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కూడా. 1956లో భోపాల్‌ మిగతా చిన్న రాష్ట్రాలతో కలిసి మధ్యప్రదేశ్‌ ఏర్పడేవరకూ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1960లలో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు నిర్వహించాడు. 1974-77 మధ్యలో కమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా పని చేశారు.

తన చివరి ఐదు సంవత్సరాల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్టోబర్‌ 9, 1999న విపరీతమైన గుండెపోటుతో ఢిల్లోని ఒక వైద్యశాలలో అడ్మిట్‌ చేశారు. కొద్ది సేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయ్‌ ఘాట్‌ వద్ద ఖననం చేశారు. ఆయన చనిపోయే వరకు విధిగా ప్రతి ఏటా తిరుమలకు వచ్చి శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేవారు.