న్యూఢిల్లీ, నవంబర్ 22 (న్యూస్‌టైమ్): ఉమాంగ్ యాప్‌ను ఆవిష్కరించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 2000లకు పైగా సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అధ్యక్షతన ఈ నెల 23వ తేదీ సాయంకాలం ఆరు గంటలకు ఆన్‌లైన్ సమావేశం జరగనున్నది. యాప్‌ను ఉపయోగిస్తున్న 20కి పైగా శాఖల నుంచి సలహాలను స్వీకరించి వారి అభిప్రాయాలను తెలుసుకోడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఉమాంగ్ యాప్‌ను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ప్రయోజనాలను ప్రత్యక్షంగా బదిలీ చేస్తున్న శాఖలు, ఉద్యోగుల బీమా సంస్థ, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు ఉమాంగ్ యాప్‌ను వినియోగిస్తున్నాయి. తాజాగా విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈ, నెథర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ఉమాంగ్ యాప్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీన జరగనున్న సమావేశంలో దీనిని విడుదల చేస్తారు.

దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సేవలను విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులు పొందగలుగుతారు. ఉమాంగ్‌లో పొందుపరచే భారత సంస్కృతీ ద్వారా భారత సంస్కృతిని విదేశీయులకు తెలియచేయడానికి, భారతదేశం పట్ల విదేశీ పర్యాటకులకు ఆసక్తి కలిగించడానికి అవకాశం కలుగుతుంది. ఉమాంగ్ మొబైల్ యాప్ (న్యూ-ఏజ్ గవర్నెన్స్ కోసం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్)ను భారతదేశ ప్రభుత్వం, ఏకీకృత, సురక్షితమైన, బహుళ-ఛానల్, బహుళ భాషా, బహుళ-సేవగా నిర్వహిస్తోంది. మొబైల్ అనువర్తనం. ఇది కేంద్రం, రాష్ట్రాల వివిధ సంస్థల అధిక ప్రభావ సేవలకు అందుబాటులోనికి తెచ్చింది.

ఉమాంగ్‌ను నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (నెజిడి), ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దీనిని నవంబర్ 23, 2017న ప్రధానమంత్రి 163 సేవలతో జాతికి అంకితం చేశారు. అందుబాటులోకి వచ్చిన కొద్ది వ్యవధిలోనే, ఫిబ్రవరి 2018లో యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన 6వ ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ఉమాంగ్ నాలుగు ప్రసిద్ధ అవార్డులను సాధించింది. పవర్ టు ఎమవర్ అనే డిజిటల్ ఇండియా నినాదంతో ప్రజలకు సులువుగా, త్వరగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ఉమాంగ్‌కు రూపకల్పన చేయడం జరిగింది. ఉమాంగ్ ప్రస్తుతం 2039 సేవలను అందిస్తోంది.

(88 కేంద్ర విభాగాల నుండి 373, 27 రాష్ట్రాల 101 విభాగాల నుండి 487, యుటిలిటీ బిల్ చెల్లింపుల కోసం 1179 సేవలు). ఉమాంగ్ ఎదురు లేకుండా మరింత ముందుకు సాగుతున్నది. ఉమాంగ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, అన్ని వెబ్ బ్రౌజర్లలలో అందుబాటులో ఉంది. జియో ఫీచర్ ఫోన్లలో ఎంపిక చేసిన 80 సర్వీసులను అందిస్తున్నది. దీనిని 3. 75 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీని వినియోగిస్తున్న వారి సంఖ్య 2.5 కోట్లకు పైగా వుంది. దీనికి కోట్ల సంఖ్యలో వినియోగదారులు 4కి పైగా రేటింగ్ ఇచ్చారు. 97183-97183కి మిస్సెద్ కాల్ ఇవ్వడం ద్వారా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.