చరిత్రలో ఈ రోజు/జూన్ 3

0
7 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్ధాంతం ప్రకారం సంవత్సరంలో నేడు 154వ రోజు (లీపు సంవత్సరంలో 155వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 211 రోజులు మిగిలి ఉన్నాయి.

సంఘటనలు…

  • 1947 : బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర అనంతరం భారతదేశంలోని స్వదేశ సంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించనున్నట్లు ప్రకటించాడు.
  • 1962 : ఫ్రాన్స్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
  • 1984 : అమృత్‌సర్‌లో గల సిక్కుల దేవాలయం స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైంది. ఇది జూన్ 6 వరకు కొనసాగింది.

జననాలు…

  • 1726 : జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు. (మ.1797)
  • 1911 : గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.
  • 1924 : కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15వ ముఖ్యమంత్రి.
  • 1929 : చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).
  • 1930 : జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.
  • 1952 : బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. ‘స్వామి’ పేరుతో పేరొందాడు.
  • 1965 : సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
  • 1966 : రాధ, భారతీయ సినీనటి.
  • 1972 : తన్నీరు హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

మరణాలు…

  • 1657 : విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)
  • 1979 : సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్‌సభ సభ్యురాలు. (జ.1911)
  • 2004 : గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
  • 2007 : రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచంలో పలువురి మన్ననలను అందుకొంది.
  • 2011 : కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజం చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
  • 2016 : ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
  • 2019 : బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)

పండుగలు, జాతీయ దినాలు…

  • ప్రపంచ సైకిల్ దినోత్సవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here