చరిత్రలో ఈ రోజు…

0
151 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్ధాంతం ప్రకారం సంవత్సరంలో నేడు 181వ రోజు (లీపు సంవత్సరంలో 182వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 184 రోజులు మిగిలి ఉన్నవి. దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు ‘గ్రెగోరియన్’ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.

సంఘటనలు…

 • 1893 : ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం – తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు. 1893 జూన్ 30న ఎక్సెల్షియర్ డైమండ్ (Excelsior diamond) దక్షిణాఫ్రికాలో Jagersfontein మైన్, కింబర్లీ (దీని కీర్తి దేశాన్ని కేంద్రంగా ఎల్లప్పుడు అధిగమింది.) 130 కిలోమీటర్ల (81 మైళ్ళ) ఆగ్నేయంలో కనుగొన్నారు. 1905 సమయంలో సుల్లినన్ డైమండ్ కనుగొన్న వరకు, ఎక్సెల్షియర్ ప్రపంచంలో అతిపెద్ద తెలిసిన డైమండు. ఇది ఒక నీలం తెలుపు రంగు కలిగి, 971 పాత carats లేదా 995,2 మెట్రిక్ carats (లేదా 194 గ్రా) బరువు కలిగి ఉంటుంది. ఎక్సెల్షియర్ రత్నం నాణ్యతలో ఇప్పటికీ రెండవ అతిపెద్ద కఠినమైన డైమండ్. ఇది చివరికి 13 నుండి 68కు కేరెట్లు బరువులతో పది రాళ్ళలోకి చేసారు (2.6 13.6 గ్రా).
 • 1914 : మహాత్మా గాంధీని, దక్షిణ ఆఫ్రికాలో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు. ఒక సంవత్సరం పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో సుమారు 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనుకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను అతను నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, అతను ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయం. ఒక విధంగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ అతను చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, అతను బాగా జనాదరణ సంపాదించాడు.
 • 1996 : 1996 యూరోకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది. జర్మనీయుల జీవితంలో క్రీడలు విడదీయరానివిగా ఉన్నాయి. ఇరవై-ఏడు మిల్లియన్ల జర్మనీయులు క్రీడల క్లబ్‌లలో సభ్యులు వ్యక్తిగతంగా అటువంటి కార్యక్రమాలలో ఉండగా అదనంగా పన్నెండు మిల్లియన్ల మంది పాల్గొంటున్నారు. అనుబంధ ఫుట్‌బాల్ అనేది బహుళ ప్రజాదరణ పొందిన క్రీడ. 6.3 మిల్లియన్లకు పైగా అధికారిక సభ్యులు ఉన్న జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (డచేర్ ఫుట్బాల్-బండ్ ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవిధమైన క్రీడా సంస్థలలో అతిపెద్దది. ప్రపంచంలోని ఏవృత్తిపరమైన క్రీడల సమితికైనా ఉండే సగటు హాజరు శాతంలో బున్దేస్లిగా ద్వితీయ స్థానంలో ఉంది. జర్మనీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఎఫ్‌ఐఎఫ్‌ఎ ప్రపంచ కప్‌ను 1954, 1974, 1990లలో ఇంకా యురోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్షిప్‌ను 1972, 1980, 1996లలో గెలుచుకుంది. జర్మనీ ఎఫ్‌‌ఎఫ్ఏ ప్రపంచ కప్‌ను 1974, 2006లలో, అదనంగా యఇఎఫ్‌ఎ యురోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్షిప్‌ను 1988లో నిర్వహించింది. విజయవంతమైన, ప్రసిద్ధిచెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఫ్రాంజ్ బెకెన్బుఎర్, గెర్డ్ ముల్లెర్, జుర్గెన్ క్లిన్స్మన్, లోథార్ మాథ్యూస్, ఆలివెర్ కహ్న్ ఉన్నారు. ప్రేక్షకులు అభిమానంగా వీక్షించే ఇతరక్రీడలలో, హ్యాండ్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఐస్ హాకీ, టెన్నిసు ఉన్నాయి.
 • 1935 : ఆస్టరాయిడ్ 1784 (బెన్గెల్లా)ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
 • 1936 : మార్గరెట్ మిచెల్ రాసిన నవల ‘గాన్ విత్ ద విండ్’ ముద్రించారు. మార్గరెట్ మున్నెర్లియన్ మిచెల్ జీవించి ఉన్న సమయంలో కేవలం ఒక్క నవలనే ప్రచురించింది. అమెరికా అంతర్యుద్ధం నేపధ్యంగా ఆమె రాసిన ‘గాన్ విత్ ద విండ్’ అనే నవల 1936లో ప్రచురితమైంది. ఈ నవలకు జాతీయ బుక్ అవార్డు, పులిట్జెర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డు కూడా లభించింది. ఈ మధ్య కాలంలో అముద్రితమైన ఆమె రచనలు కొన్ని, ఒక నవలికలను ప్రచురించారు. ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు రాసిన ‘లాస్ట్ లయ్సెన్’ అనే ఈ నవలిక విడుదలైన సంవత్సరంలో బెస్ట్ సెల్లర్‌గా నిలవడం విశేషం. అలాగే ది అట్లాంటా జర్నల్‌కు ఆమె రాసిన కొన్ని వ్యాసాలను ఈ మధ్య తిరిగి పుస్తకం రూపంలో ప్రచురించారు.
 • 1936 : వారానికి నలభై గంటల పని విధానాన్ని అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది.
 • 1940 : డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
 • 1948 : రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని ‘బెల్ లాబరేటరీస్’ ప్రకటించింది.
 • 1960 : జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.
 • 1962 : రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. రువాండా అధికారిక నామమం ర్వాండా. ఇది మధ్య, తూర్పు ఆఫ్రికాలో ఒక దేశం. ఆఫ్రికన్ ప్రధాన భూభాగంలో అతి చిన్న దేశాలలో ఒకటి. భూమధ్యరేఖకు దక్షిణాన కొన్ని డిగ్రీల దూరంలో ఉంది. దేశసరిహద్దులలో ఉగాండా, టాంజానియా, బురుండి, కాంగో గణతంత్ర రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి. రువాండా ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతంలో ఉంది. పశ్చిమ ప్రాంతంలో పర్వతాలను, తూర్పుప్రాంతంలో సవన్నాలను ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సరస్సులు ఉన్నాయి. ఉపఉష్ణ మండలీయ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. వార్షికంగారెండు వర్షపు సీజన్లు, రెండు పొడి రుతువులు ఉంటాయి. ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. 1994లో మారణకాండ ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చింది. అధికారికంగా బురుండి రిపబ్లిక్ అయిన ఇది తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్ లేక్ ప్రాంతంలో ఉన్న భూబంధిత దేశం అని అంటారు. ఉత్తర సరిహద్దులో రువాండా, తూర్పు, దక్షిణ సరిహద్దులో టాంజానియా, పశ్చిమ సరిహద్దులో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉన్నాయి. ఇది మద్య ఆఫ్రికాలో భాగంగా ఉంది. బరుండి రాజధాని ముజుంబురా. నైరుతు సరిహద్దులో తంగానికా సరోవరం ఉంది. 500 సంవత్సరాల నుండి దివా, హుటు, టుట్టీ ప్రజలు కనీసం బురుండిలో నివసిస్తున్నారు. ఇందులో 200 సంవత్సరానికంటే అధికంగా బురుండి ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తరువాత అది ఈ భూభాగాన్ని బెల్జియంకు అప్పగించింది. జర్మన్లు, బెల్జియన్లు ఇద్దరూ బురుండిని పాలించారు. రువాండా రుయాండ-ఉరుండి పేరుతో యూరోపియన్ కాలనీగా పాలించారు.
 • 1971 : రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.

జననాలు…

 • 1833 : మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు (మ.1897). శాస్త్రి బొబ్బిలి సమీపంలోని పాలతేరు అను గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30 తేదీన జన్మించారు. ఈయన వేగినాటి వైదిక బ్రాహ్మణుడు, ఆపస్తంబ సూత్రుడు, పారాశర గోత్రుడు. ఇతని తండ్రి మండపాక కామకవి, తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. ఈయన 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అక్కడే ఉన్నారు.
 • 1906 : త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955). 11 డిసెంబర్ 1911 నుంచి దాదాపు 45 సంవత్సరాల పాటు నేపాల్‌ను పరిపాలించిన రాజు. నేపాల్ రాజధాని నగరం ఖాట్మండులో జన్మించిన ఆయన తన ఐదేళ్ళ వయసుకే తండ్రి పృథ్వీ బీర్ బిక్రమ్ షా మరణానంతరం సింహాసనం ఎక్కారు, 20 ఫిబ్రవరి 1913న ఖాట్మండులో నాసల్ చౌక్, హనుమాన్ ధోకా ప్యాలెస్‌లో ఆయన తండ్రి రాజప్రతినిధిగా ఉండగా త్రిభువన్ పట్టాభిషిక్తుడు అయ్యారు, అప్పటికి రాజు స్థానం ప్రధానంగా నామమాత్రమే, దేశంలో నిజమైన అధికారం శక్తిమంతులైన, వంశపారంపర్య ప్రధాన మంత్రులైన రాణా కుటుంబంలో ఉండేది. రాణాల కాలం పాలకుల నిరంకుశత్వం, అణచివేత, ఆర్థిక దోపిడీ, మత హింసకు పేరుపడింది.
 • 1928 : జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు (మ.2004). తెలుగుప్రేక్షక హృదయాల్లో ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. జె.వి.సోమయజులు 1928 జూన్ 30వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.
 • 1934 : చింతామణి నాగేశ రామచంద్రరావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత. సి.ఎన్.ఆర్. రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేశ రామచంద్రరావు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత. ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సి.వి.రామన్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంల తరువాత భారతరత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త. ఈయన 1934 జూన్‌ 30న బెంగళూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి హనుమంత నాగేశరావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ. ఆమె ప్రాథమిక విద్య వరకే చదివినా ఆయనకు ఆమె తొలి గురువు. భారత రామాయణ కథలు, పురందర దాసు కీర్తనలు మొదలైనవి వినిపించేది. నాన్న ఆంగ్లం నేర్పించేవాడు. రామచంద్ర ఉన్నత పాఠశాలలో ఉన్న సమయంలో భారత స్వతంత్ర ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఆరాధ్య నాయకుడు. నేతాజీ పోరాటాన్ని గురించి మిత్రులకు కథలుగా చెప్పేవాడు. పదేళ్ళు నిండక మునుపే లోయర్ సెకండరీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. పెద్దయ్యేకొద్దీ స్వాతంత్ర ఉద్యమ తీవ్రత కూడా పెరిగింది. అందుకు గాంధీ టోపీ, ఖద్దరు ధరించాడు.
 • 1939 : సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు. ఎస్వీ ఆదినారాయణరావుగా ప్రసిద్ధిచెందిన భారతీయ ఎముకల వైద్యులు. ఆయన పేదలకు సేవలందించే వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. ఆయన ఆశయాలు: సామాజిక న్యాయం, సామాజిక బాధ్యతగా సమాజ సేవ. ఆయన గురువు ప్రొఫెసర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. ఆయన దేశంలో వివిధ ప్రాంతాలలో ఆదినారాయణ జరిపే నేత్ర వైద్య శిబిరాలకు సహకారం అందిస్తుంటారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. వారి తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులు. వారు అనాథలను ఆదుకోవడం డబ్బు సంపాదించడం కంటే గొప్పదని పిల్లలకు బోధించేవారు. ఆయన భార్య ఆర్.శశిప్రభ, కింగ్ జార్జి ఆసుపత్రిలో సూపరింటెంటెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వారి సోదరుడు ప్రసిద్ధ న్యూరోసర్జన్ సుంకర బాలపరమేశ్వరరావు. ఆయన సోదరుని ఆశయాల పట్ల ప్రభావితుడైనాడు.
 • 1941 : ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు. షేక్ సైదులు పౌరాణిక రంగస్థల కళాకారుడు. అతను సుమారు 8 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చాడు. నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధరించాడు. సైదులు (ఉప్పలపాటి సైదులుగా సుపరిచితుడు) స్వగ్రామం రేపల్లె తాలూకా వెల్లటూరు. అతను 1941 జూన్ 30న షేక్ అబ్దుల్లా, షేక్ మీరాబి దంపతులకు జన్మించాడు. అక్కడ గల పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అతని తండ్రి మరణిస్తే అతని మేనమామలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి అతనిని తీసుకువచ్చారు. ఉప్పలపాడు వచ్చేసరికి అతని వయస్సు 14 యేండ్లు. అతను తన 17 సంవత్సరాల వయస్సులో అతని అన్నయ్య వద్ద టైలరింగ్ వృత్తిలో చేరాడు. ఆ టైలరింగు షాపు వెనుక వైపు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మండవి సుబ్బారావు హార్మనీ వాద్యకారుడు హార్మనీ వాయించేవాడు. సుబ్బారావుకు హార్మనీ వాయించడానికొరకు పద్యాలు పాడేవారి అవసరం ఉంది. అందువలన అతను సైదులును పద్యాలు పాడించుకునేందుకు పిలుచుకొనేవాడు. సైదులుకు అప్పటికి వివిధ రకాలపద్యాల రికార్డింగులు విని పద్యాలను పాడే అలవాటు ఉంది. అతను ఉద్వేటి శ్రీరాములు పద్యాలు ఎక్కువగా పాడేవాడు. సుబ్బారావు కూడా అతనికి పద్యాలు నేర్పేవాడు. అతను మొట్టమొదట సారి సత్యహరిశ్చంద్ర నాటకంలో మాతంగ కన్య వేషంతో రంగప్రవేశం చేసాడు. ఆ నాటకంలో అతనితో పాటు ఉప్పలపాడుకు చెందిన గోగినేని సాంబశివరావు కూడా వేరొక మాతంగ కన్య వేషం వేసాడు. పిన్నమనేని నారాయణరావు ఒక పద్యాన్ని, పాటను రాసి అతనికి ఇచ్చాడు. ఆ పద్యం,పాటను నాటకంలో సైదులు పాడాడు. ఆ విధంగా వేదికపై మొట్టమొదట స్త్రీ పాత్రతో అతను పరిచయమయ్యాడు.
 • 1948 : తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడైన భరద్వాజ ‘పోతే పోనీ’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందాడు. సివిల్‌ ఇంజినీర్‌గా ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖలోనూ, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ పనిచేసిన తమ్మారెడ్డి భరద్వాజ, తన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి అడుగుజాడల్లో నడుస్తూ 1979లో సినీరంగ ప్రవేశం చేశారు. నిర్మాతగా, దర్శకుడిగా పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. తండ్రిలాగే కమ్యూనిస్టు భావాలున్న తమ్మారెడ్డి భరద్వాజ చలన చిత్ర వాణిజ్య మండలిలోనూ, నిర్మాతల మండలిలోనూ వివిధ పదవుల్ని అలంకరించి సినీ పరిశ్రమకి సేవ చేశారు. చిత్రసీమలో సమస్యల్ని పరిష్కరించడంలోనూ, కార్మికుల తరఫున పోరాడంలోనూ ఆయన ముందుంటారు. దాసరి నారాయణరావుకి సన్నిహితంగా మెలుగుతూ పలు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘కోతలరాయుడు’, ‘మొగుడు కావాలి’ చిత్రాల్ని నిర్మించి ఆరంభంలోనే విజయాల్ని అందుకొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
 • 1969 : సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు. 1969 జూన్ 30న జన్మించిన సనత్ జయసూర్య (Sanath Teran Jayasuriya) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1989 నుంచి శ్రీలంక జట్టు తరఫున మంచి ఆల్‌రౌండర్‌గా పేరుత్తెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 12,000 పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్. 403 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి మొత్తం 12207 పరుగులు చేసాడు. టెస్టులలో కూడా 107 మ్యాచ్‌లు ఆడి 6791 పరుగులు, 96 వికెట్లు సాధించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్లో శ్రీలంక విజయానికి అనేక ప్రణాళికలు వేసి కప్‌ను గెలిపించిన రికార్డు జయసూర్యది. ఆ ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంటు అవార్డు జ్యసూర్యకే వరించింది. 1997లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపైకయ్యాడు. 1999 నుంచి 2003 వరకు శ్రీలంకకు 38 టెస్టు మ్యాచ్‌లలో నాయకత్వం వహించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ ప్రదర్శించి మంచి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్నాడు.
 • టెలివిజన్‌తో ప్రయాణం మొదలుపెట్టిన నటుడు శివాజీ. ఆ తరువాత డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, సహాయ నటుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా… ఇలా పలు ప్రయత్నాలతో విజయాల్ని అందుకొన్నారు. ప్రస్తుతం నటిస్తూనే, రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. 1997లో వచ్చిన ‘మాస్టర్‌’తో మొదలుపెడితే ‘శ్రీ సీతారాముల కళ్యాణం’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బ్యాచిలర్స్‌’, ‘ప్రియమైన నీకు’, ‘ఖుషీ’, ‘చిరంజీవులు’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో శివాజీ పోషించిన పాత్రలకి మంచి పేరొచ్చింది. కొన్ని చిత్రాల్లో కథానాయకులకి సమానమైన పాత్రలు చేసి పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించారు. దాంతో ఆయన్ని కథానాయక పాత్రలు కూడా వరించాయి. అందులో భాగంగా చేసిన ‘మిస్సమ్మ’ చిత్రంతో ఆయన మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నారు.
 • 1982 : ‘అల్లరి’ నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. ‘అల్లరి’ అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు ‘అల్లరి’ నరేష్‌గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్రప్రసాద్‌గా పేరొందాడు. ‘గమ్యం’ చిత్రంలో గాలి శీను పాత్ర, ‘శంభో శివ శంభోలో’ మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు. 2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్‌లో ఇతని వివాహం చెన్నైకి చెందిన విరూపతో జరిగింది. రాజేంద్రప్రసాద్‌ తర్వాత కామెడీకి ఆ స్థాయి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన తెరపై కనిపించాడంటే చాలు… ప్రేక్షకులకు కితకితలు గ్యారెంటీ. తొలి చిత్రం ‘అల్లరి’తోనే కడుపుబ్బా నవ్వించాడాయన. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. 14 యేళ్ల వ్యవధిలోనే యాభై సినిమాల మైలురాయిని అందుకొన్నాడు. యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించడం అల్లరి నరేష్‌ శైలి. కామెడీలోనే కాదు… ‘నేను’, ‘డేంజర్‌’, ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘లడ్డూబాబు’ తదితర చిత్రాల్లో అల్లరి నరేష్‌ నటుడిగా కూడా సత్తా చాటారు.
 • 1988 : టాలీవుడ్ వర్ధమాన కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘లవర్స్‌’, ‘కేరింత’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు తనయుడైన సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడు కాకముందు తండ్రితో కలిసి సొంత నిర్మాణ సంస్థలో పనిచేశారు. 2012లో తండ్రి ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలోనే కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. రెండో చిత్రంగా చేసిన ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో ఆయనకి మంచి పేరొచ్చింది. ‘లవర్స్‌’తో వాణిజ్య విజయాన్ని అందుకొన్న సుమంత్‌ అశ్విన్‌ ‘కేరింత’తో నటుడిగా అలరించారు. ‘చక్కిలిగింత’, ‘రైట్‌ రైట్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. నిహారిక కొణిదెలతో కలిసి ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రంలో సందడి చేశాడు. ‘ఎందుకిలా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సుమంత్‌ అశ్విన్‌ ‘ప్రేమకథా చిత్రం2’తో కథానాయకుడిగా మురిపించారు.

మరణాలు…

 • 1897 : మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు (జ.1833). తన పితామహుడు మండపాక పేరయసూరి సలహా మేరకు ఆయన 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అక్కడే ఉన్న ఆయన 1897 జూన్ 30 తేదీన పరమపదించారు.
 • 1917 : దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు (జ.1825). పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఈయన 1892 నుండి 1895 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొనసాగారు. ఈయన అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. ఈయనని గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అంటారు. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ సంస్థాపకులలో ఒకరు. నౌరోజీ, ఏ.ఓ.హ్యూం, దిన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఈయన రాసిన పుస్తకం పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటెన్‌కు దోచుకు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం.
 • 1953 : బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు (జ.1881). ఈయన రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్, 1881 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు. కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు.
 • 1961 : లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ఫోనో ఫిల్మ్‌ ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త (జ.1873). లీ డి ఫారెస్ట్ తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను కనిపించని గాలి రహస్య సామ్రాజ్యాన్ని నేను కనుగొన్నాను అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో తనకు తానే రేడియో పితామహుడు (ఫాదర్ ఆఫ్ రేడియో) అనే పేరు పొందాడు. చలన చిత్రాల తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి వార్నర్‌ సోదరులు ఓ సంచలనాత్మక విజయం సాధించగా, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ఫోనో ఫిల్మ్‌ ప్రక్రియను లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. 1904లో జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ మొదటి రేడియో ట్యూబ్, డయోడ్‌ను కనిపెట్టగా, 1906లో రాబర్ట్ వాన్ లీబెన్, ఫారెస్ట్ స్వతంత్రంగా ట్రయోడ్ అని పిలిచే యాంప్లిఫైయర్ ట్యూబ్‌ను అభివృద్ధి చేశారు. తరచుగా 1907లో లీ డి ఫారెస్ట్ వాక్యూమ్ ట్యూబ్ (శూన్య నాళిక)ను కనిపెట్టడంతో ఎలక్ట్రానిక్స్‌ ప్రారంభమైనట్లు చెప్పబడుతుంది. తరువాత 10 ఏళ్ల కాలంలోనే, ఆయన కనిపెట్టిన పరికరాన్ని రేడియో ట్రాన్స్‌మిటర్‌లు, రిసీవర్‌లలో ఉపయోగించారు, అంతేకాకుండా సుదూర టెలిఫోన్ కాల్‌లకు కూడా దీనిని ఉపయోగించడం జరిగింది.
 • 1967 : వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు (జ.1899). 1925లో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఏర్పాటైన సిండికేట్ బ్యాంకు (Syndicate Bank)ను అప్పట్లో ఉపేంద్ర అమర్‌నాథ్ పాయ్, టి.ఎం.ఏ.పాయ్‌తో కలిసి వామన్ కుడ్వా స్థాపించారు. ఈ బ్యాంక్ భారతదేశంలోని ప్రాచీన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. ప్రారంభ సమయంలో దీని పేరు కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిడికేట్ లిమిటెడ్. 1969, జూలై 19న ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 14 బ్యాంకులలో ఇది కూడా ఒకటి.
 • 1984 : రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి (జ.1892). నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు. అయితే రాయప్రోలుది గుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు కొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.
 • 1988 : సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు (జ.1947). సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్రరావు తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రథమ సంతానం. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. చిన్నతనం నుంచి నాటక రంగం మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రం ఆఖరి చిత్రం.
 • 2019 : నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత (జ.1939). రామచంద్రకు గ్రామీణ నేపథ్యమన్నా, కర్షకుల జీవితాలన్నా ఎంతో ఇష్టం. తన రచనలలో కర్షకుల కష్టాలను, గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు రచించాడు. అతను వై.ఎస్.ఆర్ జిల్లాలోని రామిరెడ్డిపల్లెలో 1939 నవంబరు 12న బాలమ్మ, గంగిరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీడర్‌గా ఉద్యోగంలో చేరిన అతను వివిధ ప్రాంతాల్లో పనిచేసి 1997లో పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత రచనా రంగంవైపు దృష్టి సారించి కథారచయితగా మంచి గుర్తింపు పొందారు. యువకవులను, రచయితలను ప్రోత్సహించడానికి సాహితీ మిత్రమండలిని స్థాపించి అనేక కవి సమ్మేళనాలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతనికి సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో ప్రావీణ్యం ఉంది. రేనాడు, నూర్జహాన్‌ (చారిత్రక నవల), మాపల్లె ముచ్చట్లు, మాసీమ కథలు పుస్తకాలు ఈయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పారిజాతాపహరణం, శ్రీకృష్ణమాయ అనే పౌరాణిక పద్యనాటకాలు సైతం రాశాడు. 25కు పైగా పుస్తకాలు వెలువరించాడు. అతని సాహతీకృషికి గాను అనేక బిరుదులు, బహుమతులు వరించాయి. అతను 2019 జూన్ 30న ప్రొద్దుటూరు నాగేంద్రనగర్‌లోని తన స్వగృహంలో మరణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here