టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

93

అమరావతి, జులై 1 (న్యూస్‌టైమ్): తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు. 2011లో రెండేళ్ల కాలపరిమితితో ఆయన జేఈవోగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత నాలుగుసార్లు జేఈవోగా శ్రీనివాసరాజును కొనగిస్తూ అప్పటి ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. సుదీర్ఘ కాలంగా ఆయన కొనసాగుతుండటంతో తాజాగా ఆయన్ను బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు తితిదే జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది.