‘రెలిగేర్’‌లో త్రిశిఖర్ వెంచర్స్‌కు వాటా

0
3 వీక్షకులు
File photo

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): కాంపిటీషన్ చట్టం, 2002 సెక్షన్ 6 సబ్ సెక్షన్ (2)ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (కాంబినేషన్లతో కూడిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విధివిధానాలు) నియంత్రణలు 2011 (కాంబినేషన్ నిబంధనలు)తో కలిపి పరిగణనలోకి తీసుకుంటూ గ్రీన్ చానెల్ కాంబినేషన్‌లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దిగువ ప్రతిపాదన అందుకుంది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (రెలిగేర్/ టార్గెట్)లో 18.951 శాతం ఈక్విటీ వాటాలను ప్రతిపాదిత కాంబినేషన్‌తో కొనుగోలు చేయడానికి అనుమతి కోరుతూ ఆ ప్రతిపాదనను త్రిశిఖర్ వెంచర్స్ ఎల్ఎల్‌పీ (త్రిశిఖర్/ కొనుగోలుదారు) పంపింది. ప్రతిపాదిత కాంబినేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్) త్రిశిఖర్. దేశంలో కొనుగోళ్లు, కార్పొరేట్ పునర్ వ్యవస్థీకరణల ద్వారా విభిన్న విభాగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే కేదార గ్రూప్ అనుబంధ సంస్థ ఇది.

రెలిగేర్ కంపెనీ దేశంలో జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో వివిధ బీమా పాలసీలు అందిస్తూ ఉంటుంది. వాటిలో ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమా పాలసీలున్నాయి. అలాగే భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (జనరల్ ఇన్సూరెన్స్- రీ ఇన్సూరెన్స్) నిబంధనలు – 2016 కింద ఇన్‌వర్డ్ రీ ఇన్సూరెన్స్ వ్యాపారం చేయడానికి కూడా ఆ సంస్థకు అనుమతి ఉంది. (సెక్షన్ 6కు చెందిన సబ్ సెక్షన్ (2)ను కాంబినేషన్ నియంత్రణలు 5ఎ నిబంధనతో అనుసంధానించి (గ్రీన్ చానెల్ కింద ప్రతిపాదిత కాంబినేషన్‌లో అనుమతి కోరుతూ నోటీసు) కొనుగోలుకు ప్రతిపాదించడం అంటే అది ఫైలింగ్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ అందుకోగానే అనుమతి లభించినట్టు భావించడం అవుతుంది). సీసీఐ గ్రీన్ చానల్ ద్వారా రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 18.951 శాతం వాటాల కొనుగోలుకు త్రిశిఖర్ వెంచర్స్ ప్రతిపాదించింది. కాంపిటీషన్ చట్టం, 2002 సెక్షన్ 6 సబ్ సెక్షన్ (2)ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (కాంబినేషన్లతో కూడిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విధివిధానాలు) నియంత్రణలు 2011 (కాంబినేషన్ నిబంధనలు)తో కలిపి పరిగణనలోకి తీసుకుంటూ గ్రీన్ చానెల్ కాంబినేషన్‌లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దిగువ ప్రతిపాదన అందుకుంది.

రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (రెలిగేర్/టార్గెట్)లో 18.951 శాతం ఈక్విటీ వాటాలను ప్రతిపాదిత కాంబినేషన్‌తో కొనుగోలు చేయడానికి అనుమతి కోరుతూ ఆ ప్రతిపాదనను త్రిశిఖర్ వెంచర్స్ ఎల్ఎల్‌పి (త్రిశిఖర్/ కొనుగోలుదారు) పంపింది. ప్రతిపాదిత కాంబినేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్) త్రిశిఖర్. దేశంలో కొనుగోళ్లు, కార్పొరేట్ పునర్ వ్యవస్థీకరణల ద్వారా విభిన్న విభాగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే కేదార గ్రూప్ అనుబంధ సంస్థ ఇది. రెలిగేర్ కంపెనీ దేశంలో జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో వివిధ బీమా పాలసీలు అందిస్తూ ఉంటుంది. వాటిలో ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమా పాలసీలున్నాయి. అలాగే భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (జనరల్ ఇన్సూరెన్స్- రీ ఇన్సూరెన్స్) నిబంధనలు – 2016 కింద ఇన్ వర్డ్ రీ ఇన్సూరెన్స్ వ్యాపారం చేయడానికి కూడా ఆ సంస్థకు అనుమతి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here