Home News కెనడాలో వైభవంగా ఉగాది వేడుకలు

కెనడాలో వైభవంగా ఉగాది వేడుకలు

0
233 Views
వర్చువల్‌గా నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న కెనడాలోని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు

టొరంటో, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఈనెల 17న శనివారం నాడు ప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలను అంతర్జాల మాధ్యమం ద్వారా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది పైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి కుటుంబం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. పిమ్మట కెనడా, భారత దేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో వున్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం గావించి కొత్త సంవత్సర రాశి ఫలితాలను అందరికి వివారించారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కోవిడ్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు.

తాకా వ్యవస్థాపక చైర్మన్ చారి సామంతపూడి కెనడాలో తెలుగు వారందిరికి ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్‌కి, సన్ డైన్ అధినేత శ్రీధర్ ముండ్లూరుకి, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్దార్ ఖాన్‌కు ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు. తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల ఎన్నో మంచి పాత, కొత్త తెలుగు సమ్మేళన పాటలను పాడి కార్యక్రమంలో పాల్గొన్న వారందిరిని అలరించారు. తరువాత చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు, మేధా గేదెల, శ్రీ వత్స సంక, శ్లోక కేశర్వాణి, అజయ్ అనమంగండ్ల, సంయుత గందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాటలు, నృత్యాలు అందరిని ఎంతో ఉత్తేజపరిచాయి.

ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామచంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్‌ను ‘తాకా’ అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికి, దాతలకు, అతిధులకు వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.