ఏయూ విద్యార్థినికి వీసీ అభినందన

0
6 వీక్షకులు
విద్యార్ధిని గీతికను అభినందిస్తున్న ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఎస్‌.గీతిక రాష్ట్ర స్థాయిలో ఎన్‌సిసి విద్యార్థులకు అందించే డీడీజీ కమండేషన్‌ అవార్డును సాధించింది. విశాఖ జిల్లా నుంచి అత్యుత్తమ సేవలతో గీతిక ఈ అవార్డును సాధించింది. ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఎన్‌సీసీ డీడీజీ ఎయిర్‌ కమాండర్‌ ఎన్‌.ఎన్‌ రెడ్డి నుంచి అవార్డును స్వీకరించింది.

ఈ సందర్భంగా గీతికను వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి అభినందించారు. విద్యతో పాటు క్రీడలు, ఎన్‌సీసీ, ఎస్‌ఎస్‌ఎస్‌, కళలు తదితర రంగాలలో విద్యార్థినులు రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు.