పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహాకార సమాఖ్య (విజయ తెలంగాణ డెయిరీ) రైతులకు చెల్లించే పాల సేకరణ ధరను లీటరుకు ఒక రూపాయి చొప్పున పాడి రైతులకు పెంచడానికి నిర్ణయించింది. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి లీటరుకు నాలుగు రూపాయల ప్రోత్సాహకానికి అదనం. ఈ నిర్ణయం వలన సంవత్సరానికి లక్ష మందికి పైగా విజయ తెలంగాణ డెయిరీ పాడి రైతులు ప్రయోజనం పొందుతారు. విజయ తెలంగాణ డెయిరీ ద్వారా అదనంగా సంవత్సరానికి కనీసం 12 కోట్ల రూపాయలు పాల బిల్లుల రూపంలో రైతులకు చెల్లించడం జరుగుతుంది. లీటరుకు 4/ప్రోత్సాహకం బకాయిలు ఇటీవల పూర్తిగా చెల్లించిన నేపథ్యంలో ప్రస్తుతం పెంచుతున్న లీటరుకు ఒక రూపాయితో ఇతర ప్రైవేటు, కో-అపరేటివ్ డెయిరీలతో పోలిస్తే విజయ తెలంగాణ డెయిరీ అందరికంటే ఎక్కువుగా పాల ధరను చెల్లిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న డెయిరీ అందరికంటే ఎక్కువుగా పాల ధరను చెల్లిస్తుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న లక్షకు పైగా విజయ డెయిరీ పాడి రైతుల కుటుంబాలు డెయిరీ చైర్మన్ లోకా భూమారెడ్డి, రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.