ఏయూ పరిశోధకునిగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ

0
8 వీక్షకులు
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి నుంచి ఉత్తర్వులు స్వీకరిస్తున్న పి.కె. రథ్

విశాఖపట్నం, మే 18 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి (పీడీ)గా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (వైజాగ్ స్టీల్‌ ప్లాంట్-వీఎస్‌పీ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.కె రథ్ చేరారు. కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ప్రవేశం కల్పించారు.

వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో పి.కె రథ్‌కు ప్రవేశ ఉత్తర్వులను అందజేసి అభినందించారు. సమాజంలో, పరిశ్రమల్లో అత్యున్నత స్థానాల్లో నిలచిన వారు వర్సిటీలో పరిశోధకులుగా చేరడం శుభ పరిణామమన్నారు. తద్వారా విశ్వవిద్యాలయానికి, పరిశ్రమలకు అనుబంధం బలోపేతం అవుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం, స్టీల్ ప్లాంట్ల మధ్య విద్యార్థులకు ఉపయుక్తంగా నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఆచార్య బి.మోహన వెంకట రామ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here