బీచుపల్లిలో వే-సైడ్ మార్కెట్

161

హైదరాబాద్, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): జాతీయ రహదారిపై బీచుపల్లి వద్ద రెండెకరాలలో ‘వే – సైడ్’ మార్కెట్ (ఆధునిక రైతుబజార్) ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు చెందిన 2 ఎకరాలు స్థలాన్ని ఆధునిక రైతుబజార్‌కు కేటాయిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు కూడా జారీచేసింది వ్యవసాయ మంత్రత్వ శాఖ.

హైదరాబాద్ – కర్నూలు జాతీయ రహదారిపై టాయిలెట్ వసతులతో కూడిన మార్కెట్ ఇక ఏర్పాటుకానుంది. ఎంపిక చేసిన రైతులు స్వయంగా పండించిన కూరగాయలు రైతుబజార్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. త్వరలో మార్కెట్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.