మంత్రి మల్లాడికి సత్కారం

86
పుదుచ్చేరి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును సత్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 13 (న్యూస్‌టైమ్): హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ ప్రయివేటు కార్యక్రమానికి వచ్చిన పుదుచ్చేరి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలంగాణ మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్యతో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, మాజీ శాసనసభ్యుడు కుసుకుంట్ల శ్రీధర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు మంత్రి మల్లాడిని సత్కరించారు.