విసా రెడ్డికి ఘనస్వాగతం

200

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (న్యూస్‌టైమ్): అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు విశాఖపట్నం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్‌‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సహా పలువురు విమానాశ్రయం వద్ద సాయిరెడ్డికి జేజేలు పలికారు.

అనంతరం ఆయన నగరంలోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో సమావేశమయ్యాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సాయిరెడ్డి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించాలని, దానికి తగిన కసరత్తు ముందు నుంచే చేసుకోవాలని సూచించారు.