నేరుగా ప్రధానమంత్రి పదవికి ఎన్నికలు జరిగితే?

415

న్యూఢిల్లీ, అక్టోబర్ 27 (న్యూస్‌టైమ్): నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవికి నేరుగా ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలలో రాహుల్ గాంధీకి మెజారిటీ వస్తుంది. ఈ రాష్ట్రాలతో పాటు పంజాబ్ చాయస్ కూడా రాహుల్ గాంధీయే. ఇక మిగతా దేశమంతా ప్రధానిగా మోదీకే ప్రాముఖ్యం ఇస్తాయి. ఈ విషయం ‘సి.వోటర్-ఐఏఎన్ఎస్’ సర్వేలో వెల్లడయింది. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలు ప్రధాని పదవికి పోటీ పడితే, మీరెవరికి వోటేస్తారనే విషయం మీద ఈ సర్వే జరిగింది.

జాతీయ స్థాయిలో మాత్రం మోదీకే అధిక్యత వచ్చింది. ఆయనకు రాహుల్ కంటే 26.10 శాతం ఆధిక్యత వచ్చింది. రాష్ట్రాల విషయానికి వస్తే కేరళలో 64.96 శాతం మంది ప్రధానిగా రాహుల్‌కే ఓటేస్తామని చెప్పారు. కేరళ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ వైపు కేవలం 23.97 శాతమ మంది మాత్రమే మొగ్గు చూపారు. తమిళనాడులో రాహుల్ గాంధీని 60.91 శాతం సమర్థిస్తే, మోదీ మద్దతుదారులు కేవలం 23.97 శాతం మాత్రమే ఉన్నారు. ఇంక పంజాబ్‌లో 37.04 శాతం రాహుల్ గాంధీ కావాలంటే 36.05 శాతం మోదీకి వోటేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రాలన్నింటా బిజెపియేతర ప్రభుత్వాలున్నాయి. ఈ సర్వే కోసం జాతీయ స్థాయిలో మొత్తంగా 11,932 మందిని సంప్రదించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 451 మందిని, కేరళలో 701 మందిని, తమిళనాడులో 533, పంజాబ్‌లో 602 మందిని ప్రశ్నించారు.

ఆంధ్రలో మోదీ 11 శాతం వెనకబడి ఉన్నారు. కేరళలో 40.99 శాతం వెనకబడి ఉంటే, తమిళనాడులో 33.93 శాతం వెనబడి ఉన్నారు. ఇక పంజాబ్ ఈ గ్యాప్ బాగా తక్కువ. ఇది కేవలం 0.99 శాతమే. ఉత్తరాది రాష్ట్రాలకొస్తే రాహుల్ గాంధీ మీద మోదీకి హర్యానాలో 61.50 శాతం ఆధిక్యత ఉంది. హర్యానాలో రాహుల్‌ను ప్రధానిగా ఇష్టపడేవారు కేవలం 14.92 శాతమే. ఏప్రిల్ 18న జరిపిన మరొక సర్వే ఇంకొక ఆసక్తికరమయిన విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వేలో ప్రధాని మోదీ మీద సంతృప్తిగా ఉన్నారా? అంతసంతప్తిగా లేరా? సంతృప్తిగా లేరా? అనే మూడు ప్రశ్నలతో 11,047 మందిని సంప్రదించి అభిప్రాయాలను సేకరిస్తే, మార్చి 7 నాటి ఇదే సర్వేతో పోలిస్తే ఏప్రిల్ 18నాటికి ప్రధాని పాపులారిటీ 16.55 శాతం పడిపోయింది. మార్చి ఏడు ఆయన మీద సంతృప్తి స్థాయి 63.47 శాతం ఉంటే ఏప్రిల్ 18 నాటికి ఇది 46.92 శాతానికి పడిపోయింది.

పాపులారిటీ బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్‌తో ఫిబ్రవరి 26న పెరిగిన మాట నిజమే కాని, ఆతర్వాత పాపులారిటీ క్రమంగా తగ్గడం కనిపించింది. అయితే, రాహుల్ గాంధీ అంటే ఇష్ట పడే వారి సంఖ్య పెద్దగా పెరగడం లేదు. ఏప్రిల్ 18న ఆయన నెట్ శాటిస్‌పాక్షన్ లెవెన్ ( సంతృప్తి వ్యక్తం చేసింది) 6.82 శాతమే. ఆయన అసంతృప్తి కనబరచింది కేవలం 25.78 శాతమే. సంతృప్తి చెందిన వారి సంఖ్య 40.64 శాతం. ఆయన మీద మొత్తం సంతృప్తి 10 పాయంట్ల లోపలే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి దాకా ఇదేం మెరుగపడలేదు.