వలస కార్మికులపై ఏమిటీ వైఖరి?

0
8 వీక్షకులు

హైదరాబాద్, మే 16 (న్యూస్‌టైమ్): కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో వలస కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. కనీస సమయం కూడా ఇవ్వకుండా లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపన చెప్పాల్సిందిపోయి, దేశాన్ని ఉద్దరించినట్లు మాట్లాడడం శోచనీయమన్నారు. వలస కార్మికులను రవాణా చేసే సామర్థ్యం దేశానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుత జనాభాకు అవసరమైన రెట్టింపు ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రపంచంలో ప్రజలు ఎందుకు ఆకలితో ఉన్నారు? ఆర్థిక ప్యాకేజీలు అసలు ఖర్చు లేకుండా కలలను చూపించే రౌండ్ అబౌట్ పరిష్కారాలను ఎందుకు కలిగి ఉన్నాయి? కార్మిక వర్గం పట్ల ఇంత అమానవీయత, సున్నితత్వం ఎందుకు? అని ధ్వజమెత్తారు.

దీర్ఘకాలికమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని, వలస కార్మికులను స్వగ్రామాలకు పంపించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. దీనికి కేంద్రం రాష్ట్రాలకు ఆర్ధిక భరోసా కల్పించాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయల కనీస సహాయంగా అందించడంతో పాటు ఆహార భద్రత కల్పించాలన్నారు. స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here