ఎవరా పాప? ఏమా కథ?

1322

నిజామాబాద్, నవంబర్ 4 (న్యూస్‌టైమ్): ఆర్మూర్ పట్టణం కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన పదిహేనేళ్ల మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఆ గుర్తు తెలియని బాలిక ఒక రెండు నెలల అబ్బాయిని బస్టాండ్‌లో తిరుగుతోంది.

తీరిగ్గా పోలీసులకు అనుమానం వచ్చి అడుగగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో పోలీసులు స్థానిక ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నళినికి సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి అమ్మాయిని, బాబును నిజామాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు. అర్ధరాత్రి విధులు నిర్వహించిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నళిని సీడీపీవో ఝాన్సీలక్ష్మి, అదనపు సీడీపీవో జ్ఞానేశ్వరి తదితరులు అభినందించారు. బాలిక వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని, అప్పటి వరకూ ‘సఖి’ కేంద్రంలో పునరావాసం కల్పిస్తామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నళిని మీడియాకు తెలిపారు.