ఎస్పీ లెటర్ ఉంటేనే…

0
12 వీక్షకులు
కరోనాపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
  • లాక్‌డౌన్ తీరును సమీక్షించిన పేర్ని

మచిలీపట్నం, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): కోవిడ్-19 వ్యాప్తి నివారణకై చేపట్టిన లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేరూలని రాష్ట్ర, రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. సోమవారం ఇక్కడి ‘ముడ’ కార్యాలయంలో బందరు డివిజన్ టాస్సుఫోర్స్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం నివాసికి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినందున తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నివారణ చర్యలు కఠినం చేయలన్నారు. విజయవాడ తదితర ప్రాంతాలలో ప్రతిరోజు విధుల నిర్వహణపై రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రజారోగ్య సంక్షేమం దృష్ట్యా ఎక్కడి వారక్కడే ఉంటూ విధులు నిర్వర్తించేలా అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అక్కడక్కడ పాలు, కూరగాయలు నిత్యావసరాలు రవాణా చేసే వాహనాల్లో మనుషులను చేరవేస్తున్నట్లు తెలుస్తున్నదని అట్టి వాహనాలు సీజ్ చేయాలని నిబంధన మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

కరోనాపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

ఈ సమావేశం అనంతరం బందరు ఆర్‌డివో ఎన్ఎస్‌కె ఖాజావలి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు వెల్లడయిన కరోనా టెస్ట్ ఫలితాలలో మచిలీపట్నంలో సుకర్లాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక యువకుడికి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందన్నారు. ఈ వ్యక్తి విజయవాడలో ఉద్యోగుం చేస్తూ బందరులో నివాసం ఉంటున్నట్లు, డైలీ సర్వీసు చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. అతని నివాసం సుకర్లబాదులో 14వ వార్డు పూర్తిగా, 10వ వార్డులో కొంత భాగం రెడ్‌ జోన్‌గా గుర్తించడం జరిగిందన్నారు. పాజిటివ్ వ్యక్తిని వెంటనే పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా అతని ప్రయిమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌కు పంపడం జరిగిందన్నారు. రెడ్ జోన్ మాత్రమే కాకుండా పట్టణమంతా మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌డివో పేర్కొన్నారు.

చాలా మంది వేరే ప్రాంతాలకు ఉద్యోగాల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నదని, ఎక్కడి వారక్కడే ఉద్యోగాలు చేసే చోట్ల స్టే చేసేలా చూస్తామన్నారు. విజయవాడకు రాకపోకలు కుదరదని, ఎస్‌పి అనుమతి పత్రం మినహా మిగతా ఏవీ చెల్లవని అన్నారు. 14, 10 వార్డుల్లో రెడ్ జోన్స్‌లో ప్రజలు బయటకు రాకూడదని, వాహనాల ద్వారా ప్రతి ఇంటికి పాలు, కూరగాయలు నిత్యావసరాలు సరఫరా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, ఎంవిఐ అప్పారావు, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, డాక్టర్ బాలసుబ్రమణ్యం, రైతు బజారు ఇవో అమీర్, సిఐలు వెంకటనారాయణ, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here