దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన రుణ బకాయిల ఎగవేత (ఎన్‌పీఏలు – నిరర్థక ఆస్తులు) సమస్య నుంచి బ్యాంకింగ్ రంగం తిరిగి కోలుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరో పెద్ద ఆటంకం ఎదురైంది. కొవిడ్-19 మహమ్మారి ఇప్పటికే దిగ జారిన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు రానున్న కాలంలో రుణ బకాయిల ఎగవేతలు పెరగవచ్చునని కూడా తాజాగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది. బ్యాంకుల ఆస్తుల విలువ తరిగిపోతుందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డు అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అలాగే కరోనావైరస్ వల్ల రుణాలపై వడ్డీలు పెరిగి లాభాలు తగ్గిపోతాయని ఏజెన్సీ తెలిపింది. ప్రథమ ఆర్థిక సంవత్సరంలో పరిస్థితిని అది మదింపు వేసి తన నివేదికను వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి వల్ల దేశం రెండు నెలలకు పైగా లా డౌన్లో ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ రోజులు లాక్‌డౌన్ కొనసాగింది. దీంతో ఆర్థికవ్యవస్థ స్తంభించింది.

అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి 2021 నాటికి) వృద్ధి గణనీయంగా తగ్గిపోతుంది. వృద్ధిరేటు 2021 ఆర్థిక సంవత్సరంలో 5.0శాతం ఉండవచ్చునని ఆ ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక సంస్థల ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. రుణ బకాయిల వసూలుగాకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. గత 18 నెలలుగా నూతన దివాలా చట్టం కిందకు (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టి కోడ్-ఐబీసీ) కొన్ని బడా కేసులను తీసుకురావడం ద్వారా ఆస్తుల విలువను మెరుగుపర్చాలన్న నిర్ణయానికి ఆర్థికమాంద్యం అడ్డుగోడగా నిలిచింది. ఎగవేతదారులపై ఐబీసీ కింద 2020 మార్చి 25 నుంచి ఆరు నెలలు (ఏడాదికి పొడిగించవచ్చు) దివాలా కేసులను చేపట్టరాదని ప్రభుత్వం ప్రకటించింది. రుణ బకాయిలను వసూలు చేయడం ఇంకా జాప్యం అవుతుంది. కొవిడ్ కాలంలో రుణ బకాయిల ఎగవేతలు అధికం కావచ్చు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకులకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. ఈ దిశగా ప్రభుత్వం మూలధన పెట్టుబడులను అందించింది.

ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎక్కువగా మూలధన పెట్టుబడులను పెంచే అవకాశం ఉంది. 2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో బ్యాంకులకు ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా పెట్టుబడులను సమకూరుస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. ఎస్ అండ్ పీ ప్రకారం ఈ ఏడాది తీవ్రంగా కృషి చేసినట్లయితే మధ్యంతర వృద్ధిరేటు బలపడే అవకాశాలున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 8.5 శాతం ఉండవచ్చునని ఏజెన్సీ అంచనా వేస్తున్నది. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు ఎక్కువకాలం పట్టవచ్చునని తెలిపింది. ఆరోగ్యకరమైన జనాభా రేటు, కార్మికవర్గంపై చేసే వ్యయం, పనులు అనుకూలంగా ఉండవచ్చు. అయితే ఆస్తుల రేట్లపై ఒత్తిడి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. రుణ బకాయిల ఎగవేతలు పెరిగే అవకాశాలు ఉండటం, వసూళ్లలో జాప్యం కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకింగ్ రంగం మొత్తం రుణాల ఎగవేతలు 13 నుంచి 14 శాతానికి పెరగవచ్చు. 2020 మార్చి 31 నాటికి రుణ బకాయిలు 8.5 శాతం ఉన్నాయి. ఇవి రానున్న ఏడాదిలో బాగా పెరగనున్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది. బ్యాంకుల రుణాల వసూళ్లు వచ్చే ఏడాది కూడా బాగా తక్కువగా ఉంటాయని తెలిపింది. అలాగే బ్యాంకింగేతర (ఎస్‌బీఎఫ్‌సీ) ఆర్థిక కంపెనీలు కూడా నష్టపోతాయని వాటికి సైతం పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసింది.

ఈ కంపెనీల రుణాలు బ్యాంకుల రుణాలలో 8.8శాతం మాత్రమే ఉన్నాయి. అందువల్ల అవి రుణాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆర్థికమాంద్యం వల్ల ఎన్‌బీఎఫ్ సీ కంపెనీలు కూడా దెబ్బతింటాయి. బలహీనంగా ఉన్న ఖాతాదారులకు రుణాలు ఇచ్చినందున ఈ కంపెనీలు దెబ్బతిననున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలకు లిక్విడిటీ ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. కొన్ని బ్యాంకులు నష్టాలను చవిచూస్తాయి. వీటికి పెట్టుబడులు అవసరమవుతాయి. రానున్న 12నెలల కాలంలో బ్యాంకుల నష్టాలు 0.3శాతం సగటున ఉండవచ్చునని మూడీస్ తెలిపింది. ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో కూడా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గినందున వ్యాపారంవల్ల పొందే లాభాలకంటే 2021 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు పెరుగుతాయి. నగదు నిష్పత్తి తగ్గుతుంది. ప్రైవేటు రంగ బ్యాంకులకంటే ప్రభుత్వరంగ బ్యాంకులలో నష్టాలు ఎక్కువగా ఉంటాయని మూడీస్ తెలిపింది. గత ఏడాది ఎక్కువ ప్రభుత్వరంగ బ్యాంకులకు పెట్టుబడులు లభించాయి. అయితే కొన్ని బ్యాంకులు కనీస అవసర క్రమబద్ధీకరణను మినహాయించేందుకుగాను పెట్టుబడులను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐల స్థానికంగా దీర్ఘకాలిక, విదేశీ డిపాజిట్లు తగ్గిపోతాయని మూడీస్ అంచనా వేసింది. మొత్తం 11 బ్యాంకుల డిపాజిట్లు తగ్గవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకులు డిపాజిట్లు తరుగుదలపై సమీక్ష జరుగుతున్నది. కొంతకాలం వృద్ధిరేటు తగ్గుదల రిసను నివారించేందుకు విధానాల అమలు సవాళ్లను ఎదుర్కొంటున్నందున ద్రవ్య పరిస్థితి దిగజారుతుంది. దిగజారడానికి దేశ రేటింగ్స్ తగ్గడం ఒక కారణం. ఉండవచ్చువుతాయి.