అమరావతి నుంచి సీఎం జగన్ ప్రారంభించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు

మచిలీపట్నం, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): మహిళల భద్రతకు ప్రాధాన్యత నిస్తూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు కానుకగా ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అందుబాటులో ఉన్న జిల్లాలోని వివిధ స్థాయిల పోలీస్ అధికారులతో కలిసి తన కార్యాలయం నుండి పాల్గొన్నారు.

రాష్ట్రంలోని మహిళల భద్రతకు మరో అడుగు ముందుకేసిన రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ నేతృత్వంలోని ఏపీ పోలీస్ శాఖ సన్నద్ధం అవగా, నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో సైబర్ నేరగాళ్ల నుండి మహిళలని రక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని ఎస్పీ తెలిపారు. సీఎం ప్రారంభించిన ‘ఈ రక్షాబంధన్’ కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికలు, వివిధ రకాల మహిళా ఉద్యోగులు సైబర్ నేరాల వలలో పడకుండా ఉండేందుకు, వైట్ కలర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైనా దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, వాటిని విధంగా ఎదుర్కోవాలి అనే కార్యక్రమాలపై, పరకాల సైబర్ కేసుల పరిశోధన నిపుణులతో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్కూళ్ళు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్స్‌కి మెళుకువలు, అలాగే వివిధ సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలను రూపొందించి ప్రచారం చేయడంతో పాటు చదువుకునే విధంగా మెటీరియల్ తయారుచేయిస్తామన్నారు. సీఎం ప్రారంభించిన ‘ఈ రక్షాబంధన్’ కార్యక్రమానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌ను జిల్లా వ్యాప్తంగా 28,000 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకోగా, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని మహిళా పోలీస్ సిబ్బంది, మహిళా మిత్రులు, మహిళా మిత్ర కో ఆర్డినేటర్, పాఠశాల, కళాశాల విద్యార్ధినిలు, మహిళలు ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రదేశాల నుండి పాల్గొని వీక్షించినట్లు ఎస్పీ తెలిపారు. అదే విధంగా జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆయా పోలీస్ స్టేషన్ల నుండి ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా నిర్వహిస్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here