నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా…

(* జోగారావు ముళ్లపూడి)

రిగేకాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవతకాలం వాటిని పదిలంగా దాచుకుని, అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు. ఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం, ఓ పదం చదివితే ఇంకొన్నాళ్ళకు మరుగున పడుతుంది… కానీ, ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది.

ఇంతటి తీయని గుర్తుల ముద్రలు వేసే ఈ ఫొటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తం గా ఓ ముఖ్యమైన రోజు ఉంది. ఇందుకోసం ఆగస్టు 19 తీదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓ ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘డాగ్యుర్రియో టైప్’ను కనుగొనడం ఈ ఫొటోగ్రఫీ దినానికి మూలం. ఈ ప్రక్రీను లూయిస్ డాగ్యుర్రె అభివృద్ధి పరిచాడు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ వృత్తి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ దాటికి విలవిల్లాడిపోతోంది. అన్ని వర్గాల ప్రజలకు ఒక శాపంగా మారిన మహమ్మారి ఒక వైపు వ్యాప్తి, మరోవైపు వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు ఫొటోగ్రాఫర్లు.

కాగా స్మైల్‌ ప్లీజ్‌ అంటూ క్లిక్‌ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా వైరస్ వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బతీసింది. శుభకార్యాలు, వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత జీవన విధాన రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరిగా మారాయి. ప్రజలకు వారీ జ్ఞాపకాలను అందిస్తూ, వారి జీవనం సాగించే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి, దుకాణాలకు అద్దెలు కట్టాలేక, మరో వైపు కుటుంబ పోషణ జరపలేక నానావస్థలు పడుతున్నారు.

మార్కెట్‌లోకి మొబైల్సు, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చిన ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభకార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వేలాది మంది ఫొటోగ్రాఫర్లు, వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం తరుపున కోరుతున్నారు.

వ్యాపారాలు లేక ఖాళీగా ఉన్న హైదరాబాద్ నగరంలోని డిజిటల్ ఫొటో స్టూడియో

2020 మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా అంత వరకు జరగాల్సిన పెళ్లిళ్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్‌లు అన్నీ రద్దయ్యాయి. దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్‌లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్‌డౌన్‌ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌ పుణ్యమాని దేశవ్యాప్తంగా ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్‌డోర్‌ బుకింగ్‌లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఒకవేళ తెరుచుకున్న కరోనావైరస్ ప్రభావంతో వ్యాపారాలు లేక నానావస్థలు పడుతున్నారు. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఫోటో, వీడియో గ్రాఫర్లు కోరుతున్నారు. ఇక, ఫోటోగ్ర‌ఫీ అనేది ఒక గొప్ప‌క‌ళా ప్రావీణ్య‌త దాని వెనుక ఉన్న‌ సైన్సు, పోటోగ్ర‌ఫీ చ‌రిత్ర గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌టం కోసం ఒక రోజును ఏర్పాటు చేశారు.

ఫోటోగ్రాఫ‌ర్లు త‌మ ఫోటోల‌తో ప్ర‌పంచంలోని అద్ఛుతాల‌ను బంధించి వాటిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే గొప్ప‌క‌ళ గురించి తెలియ‌జేయడ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. కెమ‌రాల ఉనికి ద్వారా ఫోలోగ్ర‌ఫీ క‌మ్యూనికేష‌న్ మాధ్య‌మాల చ‌రిత్ర‌ను తెలియ‌జేస్తోంది. 19వ శ‌తాబ్దంలో ఫోటోగ్ర‌ఫీ ఒక వ్య‌క్తి తాను ఏవిధంగా ఒక స్థ‌లాన్ని లేదా ఒక సంఘ‌ట‌న‌ను లేదా క్ష‌ణాన్ని లేదా ఆలోచ‌న‌ని ప్ర‌తిబింబిస్తోంది. అందువల్లే ఒక చిత్రం వెయ్యి ప‌దాల అర్ధాన్ని వివ‌రిస్తోంద‌ని అంటారు. ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం డాగ్యురో అనే శాస్త్ర‌వేత్త ఆవిష్క‌ర‌ణ‌ల నుండి ఉద్భ‌వించింది. ఫ్రెంచ్‌ దేశానికి చెందిన‌ లూయిస్ డాగ్యురే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్ప్ అభివృద్ధి చేసిన ఫోటోగ్ర‌ఫీ ప్ర‌క్రియ‌ల గురించి జ‌న‌వ‌రి 9, 1839న ఫ్రెంచ్ అకాడ‌మీ ఆఫ్ సైన్సు ప్ర‌క‌టించింది.

ఆ త‌ర్వాత ఆగ‌స్టు 19, 1839న ఫ్రెంచ్ ప్ర‌భుత్వం ఈ ఆవిష్క‌ర‌ణ‌ను ప్ర‌పంచానికి ఉచిత బ‌హుమ‌తిగా ప్ర‌క‌టించింది. మొట్ట‌మొద‌టి మ‌న్నికైన రంగు ఛాయ‌చిత్రాన్ని థామ‌స్ సుట్ట‌న్ 1861లో తీశారు. మొదటి డిజిట‌ల్ ఛాయ‌చిత్రం 1957లో తీశారు. ఆగ‌స్టు 19, 2010న ప్ర‌పంచ ఫోటో డే త‌న మొద‌టి ప్ర‌పంచ ఆన్‌లైన్ గ్యాల‌రీని నిర్వ‌హించింది.

అప్ప‌టి నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు. భార‌త‌దేశంలో ఆగ‌స్టు 19న ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా అనేక క‌ళాశాల‌ల్లో, సంస్థ‌ల్లో ఫోటోగ్ర‌ఫీ పోటీని నిర్వ‌హిస్తోన్నాయి. ఫొటోలను, వీడియోలను రేడియో – సెన్‌సిటివ్ పదార్దం (ఫొటో పేపరు, ఫ్లాస్ డ్రైవు, హార్డ్ దిస్కు)పై రికార్డ్ చేయడాన్నే ఫొటోగ్రఫీ అంటాము. ఇది ఒక ఆరోగ్యకరమైన అలవాటు. ఫొటోగ్రఫీని వినోధం కోసం, వ్యాపారం, సైన్సు ప్రయోగాలు, కళాత్మకం, మాన్యుఫాక్చురింగ్ (photolithography)ల కోసం వాడుతారు. 1839 జనవరి 9వ తేదీన ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్‌సెస్ డాగ్యుర్రె టైప్‌ను ప్రకటించింది.

రోయల్ సొసైటీకి చెందిన సర్ జాన్‌ హెర్ సెల్ (Sir John Herschel) 14 మార్చి 1839న ఫొటోగ్రాఫీని ప్రపంచానికి పరిచయం చేసారు. మరో ఫోటోగ్రఫీ ప్రక్రియ అయిన కెలొటైప్‌ను 1839లో విలియం ఫాక్సు టాల్బొట్ కనుగొనగా, దానిని 1841లో ప్రకటించారు. ఫొటోగ్రాఫీ అనే పేరు గ్రీక్ భాష నుండి వచ్చింది. ఫోటోగ్రఫీని సెలబ్రేట్ చేసుకుంటూ, ఫోటోగ్రఫీ ఏ విధంగా ప్రత్యేకమైనదో తెలియజెప్పేందుకే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏటేటా నిర్వహిస్తుంటారు.

ఈ రోజుల్లో క్షణాల్లో ఎన్ని ఫోటోలనైనా తీసివేసి వెంటనే చూడగల శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నది. చరిత్రకు సాక్షిగా, విజ్ఞాన, వినోద, ఎన్నో రంగాలలో ఫోటోగ్రఫీని విసృతంగా ఉపయోగిస్తున్నారు. మానవుల జీవితాలలో ఫోటోగ్రఫీ ఎంతో ప్రభావితం చేస్తుంది. ఫొటోలను తీయడానికి కెమారాను వాడుతారు. ఇప్పుడు ఎంతో అధునాతన కెమారాలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాల పూర్వం నుండి ఫోటోలు తీసిన వారూ ఉన్నారు. గతస్మృతులను జ్ఞాపకం చేసేవి ఫొటోలే. వీడియోలు ఈకోవకే చెందుతాయి. మొదటిలో బ్లాక్ & వైట్ ఫొటోలు మాత్రమే తీయగలిగేవారు. కాలక్రమేనా కలర్ ఫొటోగ్రఫీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినది.

ప్రతి సెల్ ఫోన్‌ కెమెరాను కలిగి ఉంటుంది అంటే ఫొటోగ్రఫీ ఎంత అభివృద్ధి చెందిందో అర్దమవుతుంది. దీన్నే డిజిటల్ ఫొటోగ్రఫీ అంటాము. మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచే చాయాచిత్రం, మన జీవితాల్లో విడదీయరాని బంధమైన ఛాయాచిత్రం, మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయాచిత్రం, మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం, చైనీస్ ఫిలాసఫర్ మొట్రై, గ్రీకు మేధమెటీషియన్లు అరిస్టాటిల్, యూక్లిడ్లు క్రీస్తుపూర్వం 4–5 శతాబ్దాలలో పిన్‌హోల్ కెమెరా గురించి వివరించారు. ఆరో శతాబ్దంలో బైజంటైన్‌ శాస్తవేత్త అంధెమియస్ తన ప్రయోగాలకోసం అబ్సెక్యురా కెమెరాను ఉపయోగించాడు. తరువాత ఇబ్న్‌ ఆల్-హేతమ్‌ అనే శాస్త్రవేత్త కెమెరా అబ్స్క్యురా, పిన్‌హోల్ కెమెరా ల గురించి అధ్యయనం చేసారు. అల్బెర్టస్ మాగ్నస్ (1193/1206 – 1280 ) సిల్వర్ నైట్రేట్‌ను గుర్తించగా, జార్జెస్ ఫాబ్రిసియస్ (1516-1571) సిల్వర్ క్లోరైడ్‌ను కనుగొన్నాడు. 1568లో మరో శాస్త్రవేత్త డేనియల్ బార్ బరొ డయాప్రమ్‌‌ను వర్ణించాడు. విల్ హెల్మ్‌ హాంబర్గ్ అనే ప్రముఖుడు కొన్ని రసాయానాలను (ఫోటోకెమికల్ ఎఫెక్ట్) కాంతి ఏ విధంగా చేదిస్తుందన్న విషయాన్ని వివరించారు. మరో ఫ్రెంచ్ నిపుణుడు 1729-1774 సం. నడుమ ఫోటోగ్రఫీ గురించి వివరించాడు. ఇలా నేడు కనురెప్ప పాటులో క్లిక్ మనిపించే ఫోటోగ్రఫీ వెనక ఎందరో శాస్త్రవేత్తల కృషి, అధ్యయనాలు ఉన్నాయి.

1839 అక్టోబర్-నవంబర్ నెలల మధ్యలో డాగ్యుర్రియో టైప్ సాయంతో సుమారు క్వార్టర్ ప్లేట్ ఫొటో తీశారు. ఇది తొలి లైట్ పిక్చర్. 1826లో ఓ ఫ్రెంచ్ ఇన్‌వెంటర్ తొలి శాశ్విత ఫోటోగ్రాఫ్ తీసే ప్రయత్నాలు సాగించాడు. రక రకాల ప్రక్రియలతో ఫోటోలు తీయడంపై ప్రయోగాలు సాగించాడు. జార్జ్ ఈస్ట్ మేన్‌ నేటి కెమికల్ ఫిల్మ్‌ కెమెరాల టెక్నాలజీకి ఆధారాన్ని ఇచ్చాడు. జూనెజ్ పుహార్ 1841లో గ్లాస్‌పై ఫోటోగ్రాఫ్స్ తీయగల ప్రక్రియను గుర్తించగా, దానిని 1852లో ప్యారిస్‌లో ఎకడమిక్ నేషనల్ అగ్రికోల్ మ్యానుఫాక్చరర్స్ కమర్షియల్ గుర్తింపు ఇచ్చినది. 1847లో నిప్సే సెయింట్ విక్టర్ గ్లాస్ ప్లేట్స్ తయారీ గురించి తాను గుర్తించినట్లు ప్రక్రియను ప్రచురించాడు. బోస్టన్‌‌కు జాన్‌ విప్పల్ కూడాగ్లాస్ నెగిటివ్ ప్రక్రియ మెరుగుదలకు కృషి సేసాడు.

1851లో ఫ్రెడరిక్ స్కాట్ అర్చర్ కలోడియన్‌ ప్రక్రియను గుర్తించగా ఫోటోగ్రాఫర్, పిల్లల రచయిత లూయిస్ కరోల్ ఈ ప్రక్రియను ఉపయోగించాడు. తర్వాతి పరిశోధకులు రకరకాల రసాయన చర్యల ద్వారా ఫోటోల అభివృద్ధికి పరిశోధనలు సాగించారు. 19వ శతాబ్ది నాటికి అనేకరకాల కెమెరాలు, ఫోటోగ్రఫీ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. దశాబ్దాలు గడిచేకొద్దీ రకరకా కెమెరా డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో మెరుగుదలలు, సిరీస్‌లతో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ ఇరవై (20) ఏళ్ళలో ఎంతో బలపడింది. 1901లో మార్కెట్లోకి కొడక్ బ్రౌనీ రావడంతో ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలైన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. తొలి డిజిటల్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ 1957లో ఆరంభం అయినది. డిజిటల్ స్కానింగ్ ప్రక్రియను రస్కెల్ ఎ కిర్స్చ్ అనే కంప్యూటర్ పరిజ్ఞాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒఫ్ స్టాండర్డర్సు, టెక్నాలజీలో గుర్తించాడు.

కెమెరా ఇమేజ్‌లను కంప్యూటార్లోనికి ఫీడ్ చేయగల పద్దతిని మెరుగుపరిచాడు. తన కొడుకు వాల్డెన్‌ కిర్స్చ్ ఇమేజ్‌ను ఇలా తొలిసారి అభివృద్ధి చేశాడు. తొలి కలర్ ఇమేజ్‌ను 1861లో ఫోటోగ్రాఫ్ చేసినా, కలర్ ఫోటోగ్రఫీపై 19వ శతాబ్ది అంతా అభివృద్ధి సాగుతునే ఉంది. క్షణాల్లో ఫోటోలు చేతుల్లోకి వచ్చేసే నేటి ఆధునిక ఫోటోగ్రాఫ్ పరిజ్ఞానం వెనక ఎందరెందరో అధ్యయనాలు, పరిశోధనలు ఉన్నాయి. అంచెలంచెలుగా ఒక్కో దశ సాగి 100 ఏళ్ళ కాలంలో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం హంగులు సమకూరాయి. నాటి నుంచి నేటి దాకా ఎందరి శాస్త్రవేత్తల కృషి ఉందో గుర్తుదేసుకోవడం కోసమే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ ఉత్సవం.

రోడ్డు మీద వెళుతున్నాం పక్కనే ఓ అందమైన పక్షి కనబడింది. వెంటనే దానిని మన స్మార్ట్ ఫోన్లో బంధించేస్తాం. దానిని అందరికీ పంపించి సంబరపడిపోతాం. ఫోటోలో మనం కనబడాలని ఎంత ఉబలాట పడతామో ఫోటో తీయదానికీ అంత ఉత్సాహం చూపిస్తాం. ఓ రెండు దశాబ్దాల వెనక్కి వెళితే, అసలు ఫోటో తీయడం ఓ పెద్ద ఆర్ట్ కిందే లెక్క. ఆ కళను ప్రత్యేకంగా నేర్చుకునేవారు. కెమెరా స్వంతంగా కొనుక్కోవడం అంటే అది ఓ పెద్ద విశేషమే. అంతకు మరో రెండు దశాబ్దాల వెనక్కి వెళితే ఫోటో తీయించుకోవడం కేవలం ధనికులకు మాత్రమే ఉన్న అవకాశం. ఇలా వెనక్కి తరచి చూస్తె ఫోటోగ్రాఫీ ప్రస్థానంలో బోలెడు మైలురాళ్ళు.

ప్రపంచంలో మొదటి ఫోటో…

1826లో ఫ్రాన్సులో కెమేరాతో మొదటి ఫోటో తీశారు. జోసెఫ్ నికోఫోర్ నిప్సే అనే ఆయన తన ఇంటి మెట్లమీద ఉన్న కిటికీ నుంచి ఈ ఫోటో తీసాడు. ఒక అడ్డం మీద జూడియా బిటమిన్ (ఒక రకమైన తారులాంటి పదార్ధం) పూసి హేలోగ్రఫీ పద్ధతిలో దీనిని తీశారు. జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే లెక్కల మాస్టారు 1861లో మొదటి కలర్ ఫోటో తీసారు. 1957లో అంటే కోడాక్ డిజిటల్ కెమెరాని కనుగొనడానికి 20 ఏళ్లకు ముందు రస్సెల్ కిర్ష్ తన కొడుకును డిజిటల్ పద్ధతిలో ఫోటో తీశాడు. ఇక, లూయిస్ మొదటి సారి మనిషి ఫోటో తీసాడు. ఒక బౌలేవార్డ్ ఆలయం వద్ద నిలబడి ఉన్న మనిషిని ఫోటో తీసాడు. ఈ ఫోటో తీయడానికి ఏడునిమిషాల సమయం పట్టింది. ఈలోపు ఆ వ్యక్తి అక్కడ నుంచి కడలి వెళ్ళిపోయాడు. దాంతో మనిషిని ఫోటో తీయలేకపోయాం అనుకున్నారు. కానీ, ఆ ఆలయం ముందు ఒక వ్యక్తి షూ పాలిష్ చేయించుకుంటున్న విషయం జాగ్రతగా పరిశీలిస్తే కనిపించింది. అందుకే ఇది మొదటి మనిషిని తీసిన మొదటి ఫోటోగా గుర్తింపు పొందింది. అలాగే, ఇప్పుడంటే సేల్ఫీ ఇంత తేలికైపోయింది. అప్పట్లోనే ఒకాయన సెల్ఫి తీసుకున్నాడు. అవును, రాబర్ట్ కర్నేలియుస్ 1839లోనే అంటే దాదాపు 170 ఏళ్లకు పూర్వమే తన ఫోటోను తానే తీసుకున్నాడు. ఇదే మొదటి సెల్ఫి. అలాగే, పైనుంచి తీసే ఫోటోలు ఏరియల్ ఫోటోలుగా చెబుతారు. 1860లో మొదటి ఏరియల్ ఫోటో తీశారు. రెండు వేల అడుగుల ఎత్తునుంచి బోస్టన్ టౌన్‌ను ఈ ఫోటోలో బంధించారు జేమ్స్ వాలెస్ బ్లాక్. అక్టోబర్ 24, 1946 న వి-2 రాకెట్ నుంచి భూమికి 65 మైళ్ళ ఎత్తునుంచి భూమిని ఫోటో తీసింది రాకెట్‌కి అమర్చిన కెమెరా.

సీజన్‌ కోల్పోయి సతమతం.. ఉపాధి లేక అవస్థలు

మహమ్మద్ సిద్దెఖ్‌

తాన్ని, వర్తమానాన్ని భవిష్యత్‌ తరాలకు చూపే కళ ఫొటోగ్రఫీ సొంతం. దైనందిత జీవితంలో ఎన్నో అనుభూతులు, తీపిగుర్తులు, ఉద్వేగ క్షణాలు, చెదరని జ్ఞాపకాలను కలకాలం నిలిపేది ఒక్క ఫొటో మాత్రమే. ఒక ‘చిత్రం’ వేయి పదాలకు సమానం అంటారు. కానీ, ఇప్పుడా ‘చిత్రం’ చిన్నబోయింది. ‘కరోనా’ మహమ్మారి వారి జీవితాలను ఛిద్రం చేసింది. దీన్నే వృత్తిగా స్వీకరించి, లక్షల పెట్టుబడి పెట్టిన ఫొటోగ్రాఫర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముహూర్తాలు ఎక్కువగా ఉండే ఈ మూడు నెలల సీజన్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టుకపోగా, వారికి ఉపాధి కరువైంది. ఇంటి అద్దెలు, కెమెరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఫొటో, వీడియోగ్రాఫర్లు ఉన్నా రు.

వీరు ప్రధానంగా వివాహాలు, పుట్టిన రోజు కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఔట్‌డోర్‌లో హట్స్‌, ఆహ్వాన సాంగ్స్‌ కంపోజింగ్‌, వివిధ శుభకార్యాలు, కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడున్న హైటెక్‌ యుగంలో హై రెజల్యూషన్‌ కెమెరాలు తప్పనిసరి. ఒక్కో కెమెరాను రూ. లక్ష నుంచి మొదలు రూ. 10 లక్షలు, అంతకు పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. మరికొందరు డ్రోన్‌ కెమెరాలతోనూ ప్రోగ్రా మ్స్‌ చేసే వారున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వేలల్లో షాపులు కిరాయికి తీసుకొని ఫొటోస్టూడియోలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. శుభ ముహూర్తాలు ఉన్న సమయంలో ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పని ఉంటుంది. ఏటా పెండ్లిళ్ల సీజన్‌ వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. ఫొటోగ్రాఫర్లు ఈ మూడు నెలలు రాత్రింబవళ్లు పనిచేస్తారు.

మిగతా సమయాల్లో వీరు అడపాదడపా పని చేస్తూ ఉపాధి వెదుక్కుంటారు. శుభకార్యాలకు ఫొటోలు, వీడియోలు తీసేందుకు 5డీ మార్క్‌4 కెమెరా, జెడ్‌150 వీడియో కెమెరాతో ఒక ప్రోగ్రాం చేసి ఇచ్చే ఫొటోగ్రాఫర్‌కు రూ. 25 వేల వరకు ఆదాయం ఉండేది. మూడు నెలల్లో 15 నుంచి 30 పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఫొటోలు, వీడియోలు తీసే వారు. వాటిని ల్యాబ్‌లకు తీసుకెళ్లి ఆల్బమ్స్‌ తయారు చేస్తే షీట్‌ల లెక్కన డబ్బులు వచ్చేవి. ఇటు ఫొటోగ్రాఫర్లతో పాటు అటు కలర్‌ ల్యాబ్‌లు నిర్వహించే వారికి ఉపాధి ఉండేది. కరోనా మహమ్మారితో దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శుభకార్యాలు నిలిచి ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేకుండా పోయింది. మూడు నెలలుగా వారు ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు.

గతంలో శుభకార్యాలకు బంధుమిత్రులు ఎక్కువగా వచ్చేవారు. ఒక్క వివాహ శుభకార్యానికి సంబంధించి 100 షీట్లతో ఆల్బమ్‌ తయారు చేసుకునే కష్టమర్లు ఉండేవారు. ఇటీవల లాక్‌డౌన్‌ను సడలించిన విషయం తెలిసిందే. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులకు అనుమతి ఉంటుండడంతో కేవలం 15 నుంచి 20 షీట్స్‌కి మించి రావడం లేదని పలువురు ఫొటోగ్రాఫర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్‌ తరాలకు చూపించే అద్భుత కల ఫొటోగ్రఫీ. మన దైనందిత జీవితంలో ఎన్నో అనుభూతులు, అభిరుచులు ఉంటాయి. జ్ఞాపకాలు,ఉద్వేగ లక్షణాలు, ఇంకెన్నో తీపిగుర్తులు, చేదు క్షణాలు వీటన్నింటిని చెదిరిపోకుండా కలకాలం ఉండేది ఫొటో ఒక్కటే. గతంలో జరిగిన సంఘటనలను నేటి తరానికి అందించేది ఫొటో. ఫొటోగ్రఫీ వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటనలున్నాయి. ఫొటోగ్రఫీ అనేది రెండు గ్రీకు పదాల కలయిక. ఫొటో అంటే కాంతి అనీ, గ్రఫీ అంటే రాయడమని అర్థం.

క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఫొటోగ్రఫీ జరిగింది. 17వ శతాబ్దం నాటికి ఇరాక్‌కు చెందిన శాస్త్రవేత్త కెమెరా అబ్సుక్యురా ఆవిష్కరించారు. ఈ కెమెరా ద్వారా ఇమేజేస్‌ రికార్డ్‌ చేయడం సాధ్యం కాలేదు. వేరొక ఉపరితలంపై ప్రతిబింబింపజేశారు. గ్రహణ కాలంలో సూర్యుడు వచ్చే క్రమంలో పరిణామాలను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడింది. చివరకు 1830 అగస్టు 18న ఫ్రాన్స్‌కు చెందిన డాగురే అనే వ్యక్తి సిల్వర్‌ అయోడిన్‌ను ఉపయోగించి దృశ్యాన్ని శాశ్వతంగా ఉండొచ్చని నిరూపించాడు.

ఆ తరువాత ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినంగా జరుపుకుంటారు. ఆ తర్వాత బ్లాక్‌అండ్‌వైట్‌ నుంచి కలర్‌ వచ్చాయి. కాలానుగుణంగా నేడు గ్రామాల్లో సైతం అనేక ఫొటో స్టూడియోలు వెలిశాయి. సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తున్న మీడియాలో ఫొటోల పాత్ర కీలకంగా మారింది. ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అనేక దినపత్రికల్లో ఫొటోగ్రాఫర్లకు ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి. ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు కెమెరాలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్రతి ఏడాది అవార్డులను అందజేస్తుంది. మీడియాతో పాటు సినీరంగాల్లోనూ ఈ అవార్డులు అందజేస్తుంది. ఫొటోగ్రఫీ వైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత ఆసక్తి చూపుతోంది. చాలామంది శిక్షణ తీసుకొని వృత్తిగా మలుచుకొని జీవనం సాగిస్తున్నారు.

‘‘కరోనా కారణంగా మూడు నెలలుగా శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. చిన్నచిన్న కార్యక్రమాలకు బయటకు వెళ్లలేని పరిస్థితి. మూడు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలే. నెలకు రూ.10వేల చొప్పున రూ. 30 వేలను యజమానికి ఇవ్వాలి. కుటుంబ పోషణ భారంగా మారింది. పనిలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మూడు నెలలు శుభకార్యాలు ఉండేవి. ఈ సీజన్‌లో కష్టపడి పనిచేస్తే ఏడాది మొత్తం చేతినిండా పని ఉండేది. కరోనాతో ఎవరూ ఫంక్షన్లు నిర్వహించడం లేదు. లక్షలు పోసి కొన్న కెమెరాలు ఇంట్లో పెట్టినం. షాపు కిరాయి, కుటుంబ పోషణ, ఇతర ఖర్చులతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ఫొటోగ్రాఫర్లు ప్రభుత్వాలను కోరుతున్నారు.

(* వ్యాసకర్త: సీనియర్ వీడియో జర్నలిస్టు మహమ్మద్ సిద్దెఖ్‌; 9848582612తో కలిసి; 9059344325)