About Us

విన్నపాలు వినవలే…

గడచిన ఐదేళ్ల (2013) నుంచి కేవలం తెలుగు పత్రికలు, వెబ్ సైట్లకు వార్తలు సరఫరా చేయడంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాజాగా చేపట్టిన మార్పులు, విస్తరణలో భాగంగా పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను సాధారణ పాఠకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతీయ వెబ్ సైట్లు, ఆన్‌లైన్ పోర్టళ్లలా కాకుండా కాకుండా మాకంటూ ఓ ప్రత్యేకత చాటుకుందామనే చిరు ప్రయత్నం ఇది. న్యూస్‌టైమ్ ఏజెన్సీ (http://agency.newstime.in/aboutus.pdf) మాతృ సంస్థ తన ఆదాయంలో కొంత మొత్తాన్ని దీని నిర్వహణ కోసం వెచ్చిస్తోంది.

ప్రస్తుతానికి తెలుగు (బీటా) వెర్షన్ సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ త్వరలోనే పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. అదే విధంగా ఇంగ్లిష్, హిందీ భాషల్లో కూడా పోర్టళ్లు అందుబాటులోకి రానున్నాయి.

మా యాడ్ ప్రొవైడర్ (గూగుల్ యాడ్‌సెన్స్) సహకారంతో www.newstime.in సైట్ ఇప్పటికే మంచి పాఠకాదరణ పొందింది. ఈ ఏడాది జులై 19న లైవ్‌లోకి వచ్చిన www.newstime.in (అప్పటి వరకూ ఈ సైట్ కేవలం ఏజెన్సీ సేవలకు మాత్రమే పరిమితం. తర్వాత దీన్ని న్యూస్ కోసం కేటాయించి ఏజెన్సీ సేవల కోసం ప్రత్యేకించి http://agency.newstime.in) సైట్‌ను అందుబాటులోకి తేవడం జరిగింది.) సైట్‌ దినదిన ప్రవర్ధమానం చెందినట్లు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంది.

భారత కాలమానం ప్రకారం 2020 మార్చి 1 నుంచి ఈ సమాచారం అప్‌డేట్ చేసిన 2020 మార్చి 31వ తేదీ ఉదయం 6.35 గంటల సమయానికి (గడచిన నెల రోజుల్లో) కేవలం బీటా వెర్షన్ (ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉన్న) సైట్ సగటున రోజుకు 15748.07692307692 హిట్స్ (విజిటర్స్)ను సొంతం చేసుకుంది.

మరోవైపు, వెబ్‌సైట్లు, పోర్టళ్లు, వెబ్ చానళ్లు, న్యూస్ చానళ్ల ట్రాఫిక్ విశ్లేషణకు సంబంధించి సమర్ధవంతమైన సేవలు అందిస్తున్న Google అనుబంధ analytics ర్యాంకింగ్‌లో కూడా మా సైట్ అత్యుత్తమ గ్లోబల్ ర్యాంక్ సంపాదించింది. analytics అంచనా, విశ్లేషణ మేరకు గడచిన ఏడు రోజుల్లో న్యూస్‌టైమ్ Impressions 6.1% శాతం పెరిగి 3.8Kకు చేరుకోగా, Unique Visitors సంఖ్య 4.0Kకు చేరుకుంది. రోజుకు సగటున direct ట్రాఫిక్ 90.17%, organic 5.66%, referral 4.16% శాతం మేరకు కొత్తగా చేరుతూ వస్తుండడం విశేషం.

న్యూస్‌టైమ్ విజిటర్స్ (యూజర్ల)లో భారత్‌తో పాటు టాప్ 10 దేశాల జాబితాను పరిశీలిస్తే ఇలా ఉంది. United States, Brazil, Philippines, Vietnam, France, Peru, Italy, United Arab Emirates, Colombia. వీటన్నిటిలో యూఎస్ నుంచి ఆదరిస్తున్న విజిటర్ల సంఖ్య అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఉగండా, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, రష్యా, చైనా, స్వీడన్, కెనడా తదితర దేశాల నుంచి ఆశించిన దానికంటే మెరుగైన ట్రాఫిక్కే లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సంఖ్యను కాపాడుకోవడంతో పాటు మరింత మంది పాఠకుల చెంతకు మా సైట్‌ను చేరువ చేయాలన్న సంకల్పంతో యూనిట్ పనిచేస్తోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంతటి విజయంలో మాతో భాగస్వామ్యం అయిన మా సాంకేతిక విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సహకారం, సోషల్ మీడియా ద్వారా వారు కల్పిస్తున్న ప్రచారం కారణంగానే ఇంత తక్కువ సమయంలో ఇంతటి సంతృప్తిదాయక ఫలితాలను సాధించామని చెప్పాలి.

మా ఈ యజ్ఞంతో భాగస్వాములయ్యే ఔత్సాహికులకు న్యూస్‌టైమ్ ఆహ్వానం పలుకుతోంది. ప్రాంతం, అంశం అన్న బేధం లేకుండా ఏ విషయాన్నయినా వార్త, వ్యాసం, కామెంట్ రూపంలో (ఉంటే ఫొటోతో పాటు) మాకు పంపించవచ్చు. మా సైట్‌లో ప్రచురితమయ్యే ప్రతి ఐటమ్‌కు మంచి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది.

మరిన్ని వివరాలకు మా (newstimedaily@gmail.com) మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

ధన్యవాదాలతో,
న్యూస్‌టైమ్

Home


www.agency.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
Mobile: 6300795484 & 9390556171